కొత్తగా రూపొందించిన ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫామ్ ఫార్మాట్‌ను పునః సమీక్షించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది. ఐటీఆర్ ఫామ్‌లను మరింత సరళం చేయాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు.
కొత్త రిటర్న్ ఫామ్‌ల ద్వారా పన్ను చెల్లింపుదారులు దేశంలో తమ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలన్నింటి వివరాలతో పాటు విదేశీ పర్యటనలు, ఆధార్ నంబర్ వాటికి సంబంధించి అవసరమైన దానికన్నా ఎక్కువ సమాచారాన్ని పొందుపరచాల్సి ఉండటంతో, పన్ను చెల్లింపుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఐటీఆర్ ఫామ్ కొత్త ఫార్మాట్‌ను ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) శుక్రవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో ఐటీఆర్-1, ఐటీఆర్-2లను సమర్పించే పన్ను చెల్లింపుదారులు వారికున్న మొత్తం బ్యాంక్ ఖాతాలు, అకౌంట్ నంబర్, ఖాతా ఉన్న శాఖ చిరునామా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, మార్చి 31 వరకు అకౌంట్‌లోని నగదు నిల్వ, తదితర విషయాలన్నింటినీ వెల్లడించాలనే నిబంధనను పెట్టింది.
దీంతో పాటు పన్ను చెల్లింపుదారులకు విదేశాల్లో ఏమైనా ఆస్తులుంటే వాటిని కూడా తప్పనిసరిగా బహిర్గతం చేయాలనే నిబంధనను ఐటీ శాఖ విధించింది. దీంతో అవసరమైన దానికన్నా ఎక్కువ సమాచారాన్ని ఐటీ శాఖ అడుగుతుందని పన్ను చెల్లింపుదారులు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications