చిరు వ్యాపారుల కోసమే 'ముద్రా బ్యాంకు': ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ముద్రా బ్యాంక్‌ను బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.20 వేల కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంకును ప్రారంభించినట్లు చెప్పారు.
ముద్రా బ్యాంకు ద్వారా 5.77 కోట్ల చిన్న పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం దేశంలోని చిరు వ్యాపారులకు ప్రోత్సాహం అవసరమని, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరంగా తోడ్పాటునందించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
చిన్నతరహా పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎఫ్‌ఐలకు) రూ. 10 లక్షల వరకు రుణాలను ముద్రా బ్యాంక్‌ను అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
హైలెట్స్:

* దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎదుగుదలకు ముద్రా బ్యాంకు దోహాదపడుతుంది.
* చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల సుమారు 25 కోట్ల మంది ప్రజలకు ఉద్యోగాలు లభించే అవకాశం.
* మైక్రో ఫైనాన్స్ ద్వారా అంతర్జాతీయ అవకాశాలను ఇండియా అందిపుచ్చుకునే అవకాశం.
* ముద్రా బ్యాంకు చిన్న పరిశ్రమలకు హెల్ప్ అవుతుంది.
* నిరుద్యోగులకు స్వయం ఉపాధి దొరుకుతుంది.
* చిన్నతరహా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరంగా తోడ్పాటును అందిస్తుంది.
* ముద్రా బ్యాంకు ద్వారా 5.77 కోట్ల చిన్న పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది.


Click it and Unblock the Notifications