దావోస్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే సార్వత్రిక బడ్జెట్‌లో పన్ను పెంచే ఉద్దేశమేది ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలనుకుంటున్నట్లు దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)లో ఆయన చెప్పారు. దేశీయ ఆర్థిక రంగంలో నిర్మాణాత్మక మార్పులు చేపడితే వృద్ధిరేటు మళ్లీ 8-9 శాతానికి చేరుకోనుందన్నారు.
పన్ను చెల్లింపులపై విదేశీ పెట్టుబడిదారులు లేవనెత్తిన పలు అనుమానాలపై ఆయన వివరణ ఇచ్చారు. అసమంజసమైన పన్నులు వేస్తున్నారనే అపవాదు నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు, పన్ను చెల్లింపుల్లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చాలనుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు.

మౌలిక రంగానికి ఊతమిచ్చేందుకు రాయితీలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్ జోన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందన్నారు.
గడిచిన పదేళ్లుగా సంస్కరణలు ప్రకటించడానికి ఆసక్తి చూపినప్పటికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో గత ప్రభుత్వాలు వెనుకంజ వేశాయని, కానీ ఎన్‌డీఏ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజార్టీ రావడంతో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం భారత్‌కు అధిక లాభం చేకూరుతోందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications