ఒక్క ఎస్‌ఎంఎస్‌తో అకౌంట్‌లోని నగదు వివరాలు
న్యూఢిల్లీ: మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రతిసారి బ్రాంచ్‌కు గాని, ఏటీఎంకు గాని వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క ఎస్‌ఎంఎస్‌తో మీ మొబైల్ నెంబర్‌కు మీ అకౌంట్‌లో ఉన్న నగదు, మినీ స్టేట్‌మెంట్ వివరాలు రానున్నాయి.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
దేశీయ అతి పెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఇలాంటి సర్వీసులు అందించేందుకు సిద్ధమైంది. ఎస్‌బీఐ క్విక్ పేరుతో ప్రారంభించిన ఈ సర్వీసులను బ్యాంక్ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య ప్రారంభించారు.

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ నూతన సర్వీసులను ప్రారంభించినట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సేవలు పొందాలంటే ముందుగా ఖాతాదారులు ఎస్‌ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఆ తర్వాత ఖాతాదారుడు మొబైల్ ద్వారా ఎస్‌ఎంఎస్ లేక మిస్డ్ కాల్ ఇస్తే అకౌంట్‌లో ఉన్న నగదు వివరాలు లేక ఐదు లావాదేవీల పూర్తి వివరాలు సంక్షిప్త సమాచారంలో పంపించనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంక్ ఖాతాదారులు REG టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఖాతా నంబర్‌ను 9223488888కు పంపించాల్సి ఉంటుంది.
922376666కు ఫోన్ చేసి లేక BAL అని టైప్ చేసి ఇదే నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా కూడా నగదు వివరాలు తెలుసుకోవచ్చు. దీనితో పాటు ఒకవేళ ఏటీఎం కార్డు పోతే వెంటనే బ్లాక్ చేసుకునేందుకు BLOCK XXXX(కార్డుపై ఉండే చివరి నాలుగు నంబర్లు) టైప్ చేసి 567676కు పంపితే వెంటనే ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం జరుగుతుందన్నారు.
వీటితోపాటు గృహ, వాహన రుణాలు కావాలనుకునేవారు ఒక్క ఎస్‌ఎంఎస్‌తో వాటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 9223588888కు HOME అని కాని, CAR అని ఎస్‌ఎంఎస్ పంపితే వెంటనే లోన్లకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ నెంబర్‌కు పంపించనున్నట్లు ఆమె తెలిపారు.


Click it and Unblock the Notifications