జ్ఞాన్‌సంగమ్: బ్యాంకర్లకు ప్రధాని మోడీ హితవు (ఫోటోలు)
పూణె: ‘జ్ఞాన్‌సంగమ్' పేరుతో రెండు రోజులు పూణెలో జరిగిన సదస్సులో బద్దకపు బ్యాంకింగ్‌ను వదిలించుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. బ్యాంకు వ్యవహారాల్లో రాజకీయ జోక్యానికి తాను వ్యతిరేకమని, అయితే ప్రజాప్రయోజనాల కోసం అవసరమైన మేరకు ప్రభుత్వం జోక్యం కల్పించుకోవడాన్ని సమర్ధిస్తానని అన్నారు.
లక్ష్మీతో పాటు సరస్వతిని కూడా ఉపాసన చేస్తేనే సంపద స్థిరంగా ఉంటుందని, బ్యాంకుల్లో టాలెంట్, టెక్నాలజీ అవశ్యకతలను పాటించాలని వారికి హితవు పలికారు. ఎన్‌పిఎల భారంతో బ్యాంకులు కుప్పకూలకుండా, సంక్షోభాన్ని అధిగమించేందుకు సాధికారత కల్పిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా పిఎస్‌బిల సంస్కరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
బ్యాంకులు రిస్కులు తీసుకోవాలన్నారు. రిస్క్‌తో కూడిన వాణిజ్య నిర్ణయాల పర్యవసానాల నుంచి బ్యాంకులను కాపాడతామని ఆయన అన్నారు. బ్యాంకుల ఉనికికే ఎసరు పెడుతున్న ఎన్‌పిఎల బెడదను పరిష్కరించేందుకు అవసరమైతే నిబంధనలను సమీక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
బ్యాంకులతో సహా ఆర్థిక సంస్థలన్నింటికీ ప్రభుత్వ సాయం కొనసాగుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అభయమిచ్చారు. బ్యాంకులు తమ ఎన్‌పిఎలను ఏడాది కాలంలో వదిలించుకోవాలని, మొండిపద్దుల కింద మారతాయని అనుమానమున్న రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకోవాలని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పిలుపునిచ్చారు.

బ్యాంకర్లకు ప్రధాని మోడీ హితవు
‘జ్ఞాన్‌సంగమ్' పేరుతో రెండు రోజులు పూణెలో జరిగిన సదస్సులో బద్దకపు బ్యాంకింగ్‌ను వదిలించుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బ్యాంకు వ్యవహారాల్లో రాజకీయ జోక్యానికి తాను వ్యతిరేకమని, అయితే ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం అవసరమైన మేరకు జోక్యం కల్పించుకోవడాన్ని సమర్ధిస్తానని ఆయన అన్నారు.

బ్యాంకర్లకు ప్రధాని మోడీ హితవు
లక్ష్మీతో పాటు సరస్వతిని కూడా ఉపాసన చేస్తేనే సంపద స్థిరంగా ఉంటుందని, బ్యాంకుల్లో టాలెంట్, టెక్నాలజీ అవశ్యకతలను సూచిస్తూ బ్యాంకర్లకు హితవు చెప్పారు.

బ్యాంకర్లకు ప్రధాని మోడీ హితవు
ఎన్‌పిఎల భారంతో బ్యాంకులు కుప్పకూలకుండా, సంక్షోభాన్ని అధిగమించేందుకు సాధికారత కల్పిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా పిఎస్‌బిల సంస్కరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

బ్యాంకర్లకు ప్రధాని మోడీ హితవు
బ్యాంకులు తమ ఎన్‌పిఎలను ఏడాది కాలంలో వదిలించుకోవాలని, మొండిపద్దుల కింద మారతాయని అనుమానమున్న రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకోవాలని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పిలుపునిచ్చారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులకు తగినట్లు బ్యాంకింగ్ వ్యవస్థ మారాలని అన్నారు. కొత్త లైసెన్సుల మంజూరుతో పిఎస్‌బిలకు పోటీ పెరగతుందని, ఈ పోటీని తట్టుకునేలా బ్యాంకులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా బ్యాంకులు నైపుణ్యం ఉన్న యువతను రిక్రూట్ చేసుకోవాలని అన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌ను దేశ వ్యాప్తంగా ఉన్న పల్లెలకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించాలని అన్నారు.


Click it and Unblock the Notifications