నెల ముందే లక్ష్యాన్ని చేరుకున్న బ్యాంకులు.. జన్‌ధన్ యోజన్ కింద 10 కోట్ల ఖాతాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన్ కింద 10 కోట్ల ఖాతాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని బ్యాంకులు నెల రోజుల ముందే చేరుకున్నాయి. వచ్చే జనవరి 26వ తేదీ నాటికి 10 కోట్ల జన్‌ధన్ ఖాతాలను తెరవాలన్న లక్ష్యాన్ని బ్యాంకులకు ప్రభుత్వం నిర్దేశించింది.
డిసెంబర్ 26 నాటికే బ్యాంకులు ఈ పథకం కింద 10.08 కోట్ల ఖాతాలను తెరిచాయి. ఇది మాత్రమే కాకుండా డిసెంబర్ 22వ తేదీ నాటికి 7.28 కోట్ల రుపే కార్డులను జారీ చేశాయి. రూపే కార్డులకు, ఖాతాలకు మధ్య అంతరాన్ని జనవరి 15, 2015 కల్లా పూడ్చాలని సంయుక్త కార్యదర్శి (ఎఫ్ఐ), పిఎంజెడివై మిషన్ డైరెక్టర్ అనురాగ్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల అధిపతులు, ఐబీఏ, ఎన్‌పీసీఐ, యూఐడీఏఐ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు, జీవిత బీమా క్లెయిములను వేగవంతంగా సెటిల్ చేసే అంశాన్ని కూడా ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు 1.23 లక్షల సబ్ సర్వీస్ ఏరియాల్లో బ్యాంక్ ‘మిత్ర' డివైజ్‌లను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.
మరో 6.031 ఎస్‌ఎస్‌ఏల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. జనవరి 15 లోగా ఇది పూర్తి చేయాలని, వివరాలను తమ వెబ్‌సైట్లలోనూ పొందుపర్చాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది.


Click it and Unblock the Notifications