హైదరాబాద్: ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో ప్రారంభ టికెట్ ధరను రూ.2,015గా నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బుకింగ్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తించనున్నది.
ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చును. హైదరాబాద్ నుంచి విజయవాడ/చెన్నై/ బెంగళూరు/ తిరుపతి మధ్య టికెట్ ధరను రూ.2,015గా నిర్ణయించిన సంస్థ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్/ విజయవాడ/ తిరుపతి టికెట్ ధరను రూ.2,499గా నిర్ణయించింది.

విజయవాడ నుంచి వైజాగ్/ తిరుపతి మధ్య ధరను రూ.2,499గా నిర్ణయించింది. అలాగే బెంగళూరు టూ హైదరాబాద్‌కు రూ.2,015, బెంగళూరు నుంచి వైజాగ్/ అహ్మదాబాద్ మధ్య నడిచే సర్వీసుకు రూ.2,999 చార్జీ చేయనున్నది.
గ్రూపులుగా కొనుగోలు చేసిన వారికి ఈ తగ్గింపు ఆఫర్ వర్తించదని ఎయిర్‌కోస్టా ఎండీ ఎల్‌వీఎస్ రాజశేఖర్ తెలిపారు. ప్రతీ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా వివిధ ఎయిర్ లైన్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం సాధారణమే. కాగా, ఎయిర్ కోస్టా ఈ ఆఫర్లను అన్నింటికంటే ముందు ప్రకటించింది.


Click it and Unblock the Notifications