హైదరాబాద్: పౌల్ట్రీ పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చెప్పారు. పౌల్ట్రీ పరిశ్రమల యజమానుల సంఘం అధ్యక్షుడు రంజిత్ రెడ్డి నాయకత్వంలో పలువురు ప్రతినిధులు ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అధికారిక నివాసంలో కలిశారు.
పౌల్ట్రీ పరిశ్రమను వ్యవసాయ రంగం మాదిరిగానే గుర్తించాలని, అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ముఖ్యంగా విద్యుత్ సబ్సిడీలు, మొక్కొజన్న సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

తెలంగాణలో దాదాపు 25వేల మందికి పైగా కోళ్ల పరిశ్రమ నడుపుతున్నట్లు తమ వద్ద సమాచారం వున్నట్లు సిఎం చెప్పారు. కోళ్ల పరిశ్రమ యజమానుల కోరికను సానుభూతితో పరిశీలిస్తానని చెప్పారు. కోళ్ల పరిశ్రమ తెలంగాణ పునర్నిర్మాణంలో ఎలా భాగస్వాములను చేయాలనే విషయంపై సముచిత నిర్ణయం తీసుకొంటామన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశం తర్వాత కోళ్ల పరిశ్రమల యజమానులు మీడియాతో మాట్లాడుతూ.. సమావేశం సంతృప్తినిచ్చిందని తెలిపారు. 30ఏళ్లుగా ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకొంటున్నా ఏ ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించలేదని అన్నారు. తమ సమస్యలను కెసిఆర్ అర్థం చేసుకున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా కోళ్ల పరిశ్రమ స్థితి గతులపై సిఎం కెసిఆర్‌తో చర్చించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications