హైదరాబాద్: మహారాష్ట్రకు చెందిన ఔషధ సంస్థ పిరమల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమల్ నేతృత్వంలో ప్రతినిధి బృంధం బుధవారం సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో భేటీ అయింది. తెలంగాణలో రూ. 2వేల కోట్లతో ఔషధ, గాజు పరిశ్రమలను స్థాపించేందుకు సుముఖంగా ఉన్నట్లు వారు కెసిఆర్‌తో చెప్పారు.
ఈ సందర్భంగా పారిశ్రామిక విధానంపై పలు దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో పలు దఫాలుగా చర్చించి, పారిశ్రామిక రంగంలో విశేష అనుభవం ఉన్న వారిని సంప్రదిస్తున్నట్లు పిరమిల్ ప్రతినిధులతో కెసిఆర్ చెప్పారు. పారిశ్రామిక విధానం రూపొందించడంతోపాటు, దానిని కట్టుదిట్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పారిశ్రామిక అనుమతులకు సులువైన, సరళమైన, అవినీతిరహితమైన సింగిల్ విండో వ్యవస్థను నెలకొల్పుతామని తెలిపారు. దీని కోసం ప్రత్యేక చట్టం తేనున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించే విధంగా పారదర్శక పద్దతులు అవలంబిస్తామని చెప్పారు. అనుమతులు రెండు వారాల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలకు కేటాయించేందుకు ఇప్పటికే రెండు లక్షల ఎకరాలను గుర్తించినట్లు కెసిఆర్ చెప్పారు.
ఈ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్‌ఐఐసి)కి అప్పగిస్తామని.. భూమి, నీరు, విద్యుత్ సరఫరాతోపాటు ఇతర మౌలికసదుపాయాలు కల్పనతోపాటు సంబంధిత అనుమతులు కూడా టిఎస్‌ఐఐసీ పొందుతుందని తెలిపారు. విప్రోతోపాటు పలు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాయని తెలిపారు.
పిరమిల్ సంస్థ తెలంగాణలో యూనిట్ ఏర్పాటుకు ముందుకొస్తే కావాల్సిన భూమితోపాటు ఇతర సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కెసిఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ లోటు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. మూడేళ్ళ తర్వాత తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని వెల్లడించారు.
పారిశ్రామిక విధానంపై సమావేశం
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం గురువారం తుది రూపు దిద్దుకునే అవకాశం ఉంది. సింగపూర్ పర్యటనకు వెళ్లేలోగానే నూతన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేయాలనే యోచనలో ఉన్న కెసిఆర్... గురువారం సచివాలయంలో దీనిపై సమావేశం నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. రెండు వారాల్లోనే అనుమతులు మంజూరు చేసేలా సింగిల్ విండో విధానాన్ని రూపొందించి... దీనికి చట్టబద్ధం చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications