న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు దేశంలో ఉన్న నల్లధనంపైనా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను శాఖకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు సూచనలు చేశారు.
విదేశాల్లో ఉన్న నల్లధనంపై ఏ విధంగా పోరాడుతున్నామో.. దేశంలోని నల్లధనంపైనా అంతే కఠిన స్థాయిలో స్పందించాలని అరుణ్ జైట్లీ ఆదేశించారు. విదేశాల్లో ఉన్న అక్రమార్కుల సంపదను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని తెలిపారు.

అదే స్థాయిలో దేశంలో ఉన్న నల్లధనాన్నీ బయటకు తెచ్చేందుకు ఐటి అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని అరుణ్ జైట్లీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరని నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్లు బడ్జెట్‌లో అంచనా వేసినదాని కంటే అధికంగా అవుతాయన్న విశ్వాసాన్ని అరుణ్ జైట్లీ వెలిబుచ్చారు.
ఇదిలావుంటే నల్లధనాన్ని రూపుమాపేందుకు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆర్గనేజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒఇసిడి) సోమవారం ఆటోమెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్చేంజ్ విధానాన్ని ప్రకటించింది. భారత్, స్విట్జర్లాండ్‌తోసహా వివిధ దేశాల మధ్య ఫైనాన్షియల్ అకౌంట్ల వివరాలు ఆటోమెటిక్‌గా పరస్పరం అందుకునేలా ‘సింగిల్ గ్లోబల్ స్టాండర్డ్'ను ఆవిష్కరించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications