న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 39ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు తెరతీసింది. వచ్చే ఏడాది వ్యవధిలో 18వేల మేర సిబ్బందిని తొలగించనున్నట్లు కంపెనీ సిఈఓ సత్య నాదెళ్ల గురువారం ప్రకటించారు. ఈ చర్యలు కఠినమైనవే అయినప్పటికీ కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన నోకియా మొబైల్ డివైస్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌తో అనుసంధానించేందుకు ఇవి తప్పనిసరి అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు.
రానున్న 12 నెలల్లో పన్ను ముందస్తు ఛార్జీల రూపంలో 1.6 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 9,600 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సిఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి సిబ్బంది ఉద్వాసన ప్రకటన కావడం గమనార్హం. అయితే భారత్ చాలా కీలకమైన మార్కెట్‌గా నిలుస్తున్నందున ఇక్కడ ఉద్యోగాల కోతలు పెద్దగా ఉండకపోవచ్చని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ సిబ్బంది పునర్ వ్యవస్థీకరణ ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని తెలిపారు.

కాగా, కోత విధిస్తున్న 18,000 ఉద్యోగుల్లో సుమారు 12,500 వరకూ నోకియా డివైజెస్ అండ్ సర్వీసెస్ బిజినెస్‌కు చెందిన నిపుణులు, ఫ్యాక్టరీ సిబ్బందివే ఉంటాయని సమాచారం. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, నోకియా డివైజెస్‌ల మధ్య సిబ్బంది పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. తొలి విడతలో భాగంగా 13,000 సిబ్బందిని తొలగించేందుకు చర్యలు ప్రారంభించినట్లు, వచ్చే 6 నెలల్లో ఎవరిని తొలగించబోతున్నామనేది ప్రకటిస్తామని సత్య నాదెళ్ల వెల్లడించారు.
2015 జూన్ నాటికి ఈ మొత్తం సిబ్బంది కోత ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. 2013 జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ సంస్థలో 99,000 వేల మంది సిబ్బంది ఫుల్‌టైమ్ పని చేస్తున్నారు. ఇందులో 58,000 మంది అమెరికాలో, మిగితా 41,000 మంది ప్రపంచ వ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నోకియాను కొనుగోలు చేసిన తర్వాత కంపెనీలోకి కొత్తగా వచ్చిచేరిన ఉద్యోగులు ఇందులో లేరు. 2009లో మైక్రోసాఫ్ట్ సుమారు 5,800 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో కోతలను ప్రకటించడం ఇదే తొలిసారి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications