బెంగళూరు: బ్రెజిల్‌లో ఫిఫా ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఓరియన్ మాల్ ‘ఫుట్‌బాల్ కార్నివాల్-2014'ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రపంచ కప్‌లో కొన్ని మ్యాచులు చూడకపోవడం వల్ల కోల్పోయిన ఆనందాన్ని అభిమానులు, ఫుట్‌బాల్ ఆడాలనే కోరిక ఉన్న అభిమానులు ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మాల్ నిర్వాహకులు చెబుతున్నారు.
తాము ఏర్పాటు చేసిన ఈ పెద్ద ఫుట్‌బాల్ కార్నివాల్‌లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటుకోవచ్చని వారంటున్నారు. తమ మాల్ ముందున్న ఆరు ఫీట్ల పొడవు, 6 ఫీట్ల వెడల్పు ఉన్న ‘ఫుట్‌బాల్ 2014' కటౌట్ అభిమానులకు ఆహ్వానం పలుగుతోందని చెప్పారు. ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న 32 దేశాల జాతీయ పతాకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓరియన్ మాల్ కార్నివాల్‌లో పాల్గొని ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రోఫీ గెల్చుకోవచ్చని తెలిపారు.
మీరు బ్రెజిల్‌లో జరిగే ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనలేకపోయినప్పటికీ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్నివాల్‌లోని తమ అభిమాన జట్టుకు మద్దతు తెలుపవచ్చని అన్నారు. ఇక్కడికి వచ్చిన ఇతర అభిమానులతో తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని తెలిపారు. కస్టమైజేషన్ కేంద్రాలను మాల్ చుట్టూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీరు అభిమానించే జట్టుకు సంబంధించిన రంగులు, టీషర్టులు, హేర్ కలర్ ఇక్కడ లభిస్తాయని చెప్పారు. మీ స్నేహితులతో కలిసి ఈ ఆనంద క్షణాలను ఫొటోల్లో బంధించుకోవచ్చని తెలిపారు.
మాల్ జరిగే సంబరాలను మీరు వీడియో తీసుకోవచ్చని.. మీ జీవితంలో ఇవి ఓ జ్ఞాపకంగా మిగిలిపోతాయని నిర్వాహకులు చెప్పారు. ఇక్కడే ఏర్పాటు చేసిన ఆటల్లో పాల్గొని పుమా వస్తువులను గెలుచుకోవచ్చని అన్నారు. ఒకేసారి ఆరుగురు ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆడేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కేంద్రాలలోని నిపుణుల నుంచి ఫుట్‌బాల్ ఆటపై మంచి అవగాహన పెంచుకోవచ్చన్నారు. జులై 13 వరకు ఈ కార్నివాల్ కొనసాగుతుందని తెలిపారు.

ఫుట్‌బాల్ కార్నివాల్
బ్రెజిల్‌లో ఫిఫా ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఓరియన్ మాల్ ‘ఫుట్‌బాల్ కార్నివాల్-2014'ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

ఫుట్‌బాల్ కార్నివాల్
ప్రపంచ కప్‌లో కొన్ని మ్యాచులు చూడకపోవడం వల్ల ఆనందాన్ని కోల్పోయిన అభిమానులు, ఫుట్‌బాల్ ఆడాలనే కోరిక ఉన్న అభిమానులు ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మాల్ నిర్వాహకులు చెబుతున్నారు.

ఫుట్‌బాల్ కార్నివాల్
తాము ఏర్పాటు చేసిన ఈ పెద్ద ఫుట్‌బాల్ కార్నివాల్‌లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటుకోవచ్చని వారంటున్నారు

ఫుట్‌బాల్ కార్నివాల్
తమ మాల్ ముందున్న ఆరు ఫీట్ల పొడవు, 6 ఫీట్ల వెడల్పు ఉన్న ‘ఫుట్‌బాల్ 2014' కటౌట్ అభిమానులకు ఆహ్వానం పలుగుతోందని చెప్పారు.

ఫుట్‌బాల్ కార్నివాల్
ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న 32 దేశాల జాతీయ పతాకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓరియన్ మాల్ కార్నివాల్‌లో పాల్గొని ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రోఫీ గెల్చుకోవచ్చని తెలిపారు.

ఫుట్‌బాల్ కార్నివాల్
మీరు బ్రెజిల్‌లో జరిగే ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనలేకపోయినప్పటికీ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్నివాల్‌లోని తమ అభిమాన జట్టుకు మద్దతు తెలుపవచ్చని అన్నారు.

ఫుట్‌బాల్ కార్నివాల్
ఇక్కడికి వచ్చిన ఇతర అభిమానులతో తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని తెలిపారు. కస్టమైజేషన్ కేంద్రాలను మాల్ చుట్టూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఫుట్‌బాల్ కార్నివాల్
మీరు అభిమానించే జట్టుకు సంబంధించిన రంగులు, టీషర్టులు, హేర్ కలర్ ఇక్కడ లభిస్తాయని చెప్పారు. మీ స్నేహితులతో కలిసి ఈ ఆనంద క్షణాలను ఫొటోల్లో బంధించుకోవచ్చని తెలిపారు.

ఫుట్‌బాల్ కార్నివాల్
ఇక్కడే ఏర్పాటు చేసిన ఆటల్లో పాల్గొని పుమా వస్తువులను గెలుచుకోవచ్చని అన్నారు. ఒకేసారి ఆరుగురు ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆడేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications