బెంగళూరు: రోజంతా తమ విధుల్లో మునిగితేలుతూ అలసిపోయిన వారి కోసం బిగ్ బన్యన్ సమ్మర్ నైట్ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ వద్ద బిగ్ బన్యన్ వైన్స్, కాక్ టెయిల్స్ షోకేజ్‌ను ప్రారంభించింది. ఇది సాయంత్రం 4 గంటల నుంచి అర్ధ రాత్రి 1గంట వరకు కొనసాగుతుంది. కిచ్ మండీలో వివిధ ఆధునిక వస్తువులు, పరికరాలు కలిగిన అనేక స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఇక్కడికి వచ్చిన ఆసక్తి గల వినియోగదారులకు బన్యన్ వైన్స్ గ్లాసులలో సర్వింగ్ చేయబడుతుంది. వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఉంటే బాటిళ్ల ద్వారా సర్వింగ్ చేస్తారు. కాక్ టెయిల్ అండ్ సంగారియా వినియోగదారుల కోసం ఇతర బ్రాండ్లకు సంబంధించిన వైన్స్‌ను వివిధ టేబుల్స్ పైన ఏర్పాటు చేశారు. బిగ్ బన్యన్స్ సిగ్నేచర్ వైన్స్ బ్రాండ్లను కూడా ఇక్కడ లభిస్తాయి.

ఇక్కడికి వచ్చిన వినియోగదారులు బిగ్ బన్యన్స్ వైన్స్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. వాటి రుచిని చూడవచ్చు. కిచ్ మండి వైన్స్ వినియోగదారులకు ఓ అద్భుత వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. సుమారు 2,500 మంది స్టాల్స్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
కిచ్ మండిలో అనేక రకాలైన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఏర్పాటు చేసినట్లు బిగ్ బన్యన్ వైన్స్ బ్రాండ్ మేనేజర్ ఐషా సహాని తెలిపారు. ఇది గొప్ప సంగీతం, మంచి ఆహారం, ఎంటర్ ప్రిన్యూర్ షిప్‌ను ప్రమోట్ చేస్తోందని అన్నారు. ఇక్కడికి వచ్చిన వినియోగదారులు ఉత్పత్తులను స్వీకరించి ఆనందిస్తున్నారని చెప్పారు. బిగ్ బన్సన్ వైన్స్ 2007లో ప్రారంభమైంది. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులోనే ఉంది.


Click it and Unblock the Notifications