
11వ పంచవర్ష ప్రణాళిక (2007-12) లోనూ పెరిగిన ఉద్యోగ కల్పనలో తయారీ రంగం 28.5 శాతం వాటాను కలిగి ఉందని అసోచాం ఈ అధ్యయనంలో గుర్తించింది. ‘2007-08 లో 10.45 మిలియన్ ఉద్యోగాలుంటే, 2011-12 నాటికి వీటికితోడు మరో 2.9 మిలియన్ ఉద్యోగాలు కొత్తగా వచ్చాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
ఇదిలావుంటే గత పంచవర్ష ప్రణాళికలో దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యోగ సృష్టిలో తమిళనాడు అత్యధికంగా 14.5 శాతం వాటాతో ముందున్నట్లు అసోచాం సర్వే ద్వారా తేలింది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (14 శాతం), గుజరాత్ (10 శాతం) రాష్ట్రాలున్నాయి. అయితే 11వ పంచవర్ష ప్రణాళికలో తయారీ రంగం ద్వారా ఏర్పడిన ఉద్యోగాలను గమనించినట్లయితే ఉత్తరాఖండ్ అగ్రస్థానంలో నిలిచింది.
ఆ తర్వాత బీహార్ (71.8 శాతం), హిమాచల్ ప్రదేశ్ (70 శాతం), ఒడిషా (54 శాతం), మహారాష్ట్ర (38.8 శాతం) ఉన్నాయి. చత్తీస్‌గఢ్ (19 శాతం), ఉత్తరప్రదేశ్ (15 శాతం), హర్యానా (14 శాతం), కేరళ (10.5 శాతం), పంజాబ్ (9 శాతం) రాష్ట్రాలు ఉద్యోగ కల్పనలో చివరి స్థానంలో ఉన్నాయి.
‘చోటా భీమ్'కు ఫిక్కీ ఫ్రేమ్స్ అవార్డు
గ్రీన్ గోల్డ్ యానిమేషన్ రూపొందించిన 'చోటా భీమ్'కు ప్రతిష్ఠాత్మకమైన ఫిక్కీ ఫ్రేమ్స్ అవార్డు లభించింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన బెస్ట్ క్యారెక్టర్ అవార్డును ఫిక్కీ ఫ్రేమ్స్ కో చెయిర్ ఆశిష్ కులకర్ణి చేతుల మీదుగా చోటా భీమ్ రూపకర్త రాజీవ్ చిల్కా అవార్డును స్వీకరించారు.


Click it and Unblock the Notifications