
పలు విదేశీ బహుళజాతి కంపెనీలు కూడా ఈ ఏడాదిలో కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంత మంది పారిశ్రామిక దిగ్గజాలు దేశం నుంచి బయటికి వెళ్లరాదని ఆదేశాలు కూడా అందుకున్నారు. కోర్టు చుట్టూ చక్కర్లు కొట్టిన మరికొందరు ప్రముఖులు అడాగ్‌కు చెందిన ముఖేష్ అంబానీ, కుమారమంగళం బిర్లా, నవీన్ జిందాల్, రవి రుయా. వీరందరూ వివాదాస్పద కేసుల్లో కోర్టు గడప తొక్కాల్సి వచ్చింది.
బహుళజాతి సంస్థల్లో ముఖ్యంగా ఫిన్నిష్ మొబైల్ సెట్ తయారీ కంపెనీ నోకియా పన్నుల కేసుకు సంబంధించి కోర్టు గడప తొక్కింది. అలాగే బ్రిటన్‌కు చెందిన వేదాంత గ్రూపు, కొరియాకుచెందిన ఉక్కు కంపెనీ పోస్కో, స్విస్ ఫార్మా కంపెనీ నోవార్టిస్ కంపెనీలు సుప్రీంకోర్టులో పలు కేసుల విషయంలో హాజరయ్యాయి. కేసుల విషయానికి వస్తే పర్యావరణానికి సంబంధించిన కేసుతో పాట పేటెంట్ కేసుల వరకు కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నాయి.
నోవార్టిస్ విషయానికి వస్తే క్యానర్స్ ఔషధానికి సంబంధించి పేటెంట్ కేసు సుప్రీంకోర్టులో ఓడిపోయింది. భారతీయ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాన్సర్ ఔషధాన్ని అతి చౌకకు భారతీయ కంపెనీ తయారు చేసి మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. మధుమేహానికి సంబంధించిన యాంటీ డయాబిటిక్ ఔషధం కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు అమెరికా ఔషధ దిగ్గజం మెర్క్ షార్ప్ అండ్ డోమ్ (ఎంఎస్‌డీఐ) కేసును కొట్టివేసింది. గ్లెన్‌మార్క్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది.
ప్రముఖ దేశీయ కంపెనీ సహారా ఇండియా పరివార్‌కు మాత్రం ఈ ఏడాది గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. సహారా ఇండియా పరివార్.. సెబి (స్టాక్ ఎక్చ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) అనుమతి లేకుండా ప్రజలనుంచి రూ.20,000 కోట్లు సేకరించింది. దీంతో సహారాకు వ్యతిరేకంగా సెబి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు సెబికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు.. ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి వాపసు చేయాలని ఆదేశించింది.
ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి ఇవ్వకుండా జాప్యం చేయడంతో సహారా చైర్మన్ సుబ్రతోరాయ్ సుప్రీంకోర్టు ఆగ్రాహానికి గురి కావాల్సి వచ్చింది. కోర్టు ధిక్కారం కేసు కూడా నమోదు అయింది. దీంతో దేశం నుంచి బయటికి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. రాయ్‌తో పాటు కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగుల్లో 2జీ స్పెక్ట్రమ్ కేసులో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
2జీ స్పెక్ట్రమ్ కేసు భారతీ సెల్యూలార్ సిఎండి సునీల్ మిట్టల్, ఎస్సార్ గ్రూపు ప్రమోటర్ రవి రుయా రిలయన్స్ అడాగ్ చీఫ్ అనిల్ అంబానీలు కూడా సుప్రీం కోర్టు గడప తొక్కాల్సి వచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టునిందితులుగా... ప్రత్యక్ష సాక్షులుగా కోర్టు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే వారు దీన్ని నుంచి మినహాయించాలని సుప్రీంను ఆశ్రయించారు. దీంతో మిట్టల్, రుయాలు సుప్రీంకోర్టుకు హాజరీ నుంచి మినహాయింపు లభించింది.
అయితే అనిల్ అంబానీకి మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు. మాజీ టెలికం శాఖమంత్రి ఎ రాజాతో పాటుకంపెనీకి చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లతో సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిదేనని ఆదేశాలు జారీ చేసింది. అనిల్ అంబానీతో పాటు భార్య టీనా అంబానీ కూడా పాటియాలా కోర్టులో హాజరైన సీబీఐ ప్రత్యేక జడ్జి ఒపి సైనీ ప్రశ్నలకు జవాబు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అడాగ్‌కు ససాన్ విద్యుత్ ప్రాజెక్టుకు అక్రమంగా బొగ్గు బ్లాకులు కేటాయించడంపై సీబీఐని దర్యాప్తు చేయాల్సిందిగా ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. ఇదే సంవత్సరంలో జెట్ - ఎతిహాథ్ ఎయిర్‌వేస్ ఒప్పందాన్నిరద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. ఈ ఒప్పందంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని కోర్టు పేర్కొంది. ఈ ఏడాదిలోనే బ్రిటన్‌కు చెందిన వేదాంత గ్రూపు తమిళనాడు లో స్టెరిలైట్ ఇండస్ట్రీస్ పర్యావరణానికి ముప్పు కలిగిస్తుందని సుప్రీంకోర్టు రూ.100 కోట్లు జరిమానా విధించింది.
నీరా రాడియా టేపు సంభాషణలు విన్న సుప్రీంకోర్టు దేశంలోని అతి పెద్ద కార్పొరేట్‌లకు అనుకూలంగా అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వారిలో ముఖేష్ అంబానీకి చెందిన రిల్, అనిల్ అంబానీకి చెందిన అడాగ్, టాటాలు.. విమానయాన రంగంలో లైసెన్సుల కోసం పెద్ద ఎత్తున చేతులు మారాయని యూనిటెక్ షేర్లలో గోల్‌మాల్ జరిగినట్లు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపించాల్సిందిగా సిబిఐని ఆదేశించింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications