
కొత్త ఏడాది మొదటి త్రైమాసికంలో నియామకాలు జోరుగా కొనసాగుతాయని మ్యాన్‌పవర్ గ్రూప్ విడుదల చేసిన ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే స్పష్టం చేస్తోంది. కొత్త ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్న దేశాల్లో తైవాన్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో న్యూజిలాండ్, కొలంబియా, సింగపూర్ ఉన్నాయి. ఇటలీ, ఐర్లాండ్, ఫిన్లాండ్, స్పెయిన్, స్లొవేకియా, బెల్జియంలలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని తెలుస్తోంది.
వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో నియామకాలు చేపట్టడానికి దేశీయ కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయని, ముఖ్యంగా మైనింగ్, నిర్మాణ, సేవా రంగాల నుంచి కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నివేదిక పేర్కొంది. ఇండియాకు 33 శాతం నికర ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్‌ను ప్రకటించింది. ఐటి రంగంలో కూడా కొత్త ఉద్యోగాలు భారీగా రానున్నాయని, భారత, అంతర్జాతీయ ఐటి కంపెనీలు కూడా ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలోనే ఇవ్వనున్నాయని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏజి రావు తెలిపారు.
దేశవ్యాప్తంగా 5,006 కంపెనీలను సర్వే చేసి ఈ నివేదిక విడుదల చేసింది. మైనింగ్, నిర్మాణ రంగాలతో పాటు, హోల్‌సేల్, రిటైల్ ట్రేడ్ రంగంలో కూడా నియామకాలు జోరుగా సాగుతాయని, ఈ రంగాలకు 38 శాతం నికర ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్‌ను ప్రకటించింది. అలాగే, మొదటి త్రైమాసికంలో వేతనాలు పెంచేందుకు దేశీ కంపెనీలు సమాయత్తమవుతున్నాయని తెలిపింది. 2014లో నియామకాలు మెరుగ్గా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నప్పటికి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
నవంబర్‌లో హైదరాబాద్‌లో నియామకాలు 7 శాతం వృద్ధి చెందాయని ఇన్ఫోఎడ్జ్ గ్రూప్‌కు చెందిన ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ నౌకరీ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే నియామకాల్లో 10 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. గత నెలలో ఫార్మా రంగంలో నియామకాలు 4 శాతం క్షీణించాయని పేర్కొంది. హైదరాబాద్‌లో నియామకాల వృద్ధికి ఐటి, ఐటిఇఎస్ రంగాలు తోడ్పడుతున్నాయని, 2014లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్లు నౌకరీ ఇవిపి, హెడ్ సేల్స్ విభాగం వి సురేశ్ చెప్పారు. కాగా భారత్‌లో ప్రతిభ గల ఉద్యోగులకు కొదవ లేకపోవడంతో పలు అంతర్జాతీయ కంపెనీలూ భారత్ వైపు చూస్తున్నాయని నివేదిక పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications