
కాగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ప్రజలు బిజెపికే పట్టం కట్టిన తీరు సమీప కాలంలో భారతీయ స్టాక్ మార్కెట్లకు భారీ ఉత్సాహాన్ని అందించే వీలుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్ మాన్ శాచ్, నోమురా, సిఎల్ఎస్ఏ వంటి విదేశీ బ్రోకరేజ్ సంస్థలు ఇప్పటికే మార్కెట్‌లో ఏర్పడిన సానుకూలతకు కారణంగా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ అని ప్రకటించాయి. ఇది ఇలా ఉండగా వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపే నిఫ్టీ చారిత్రక గరిష్టస్థాయి 6700కి చేరగలదని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది.
అయితే నిజానికి స్థిరమైన ప్రభుత్వాన్ని మదుపర్లు ఇష్టపడతారని ఈనమ్ ఫైనాన్షియల్ వల్లభ్ భన్సాలీ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల్లో వెనుకబడి పోవడాన్ని మార్కెట్‌కు రుచించలేదని ఆయన అన్నారు. ఇదిలావుంటే అక్టోబర్ నెలలో పారిశ్రామిక ప్రగతి గణాంకాలు, నవంబర్‌లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలు, డిసెంబర్ 18న రిజర్వ్ బ్యాంక్ చేపట్టబోయే ద్రవ్యవిధాన సమీక్ష మార్కెట్ సరళిపై ప్రభావం చూపుతాయని నిపుణులు స్పష్టం చేశారు.
గుజరాత్ మాదిరి వృద్ధిరేటు దేశవ్యాప్తంగా ఉండాలని, బిజెపి ప్రభుత్వమే అంతటా ఉండాలనే ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తమవుతోందని, ఇదే బిజెపి నాలుగు రాష్ట్రాల్లో మంచి ప్రదర్శనకు కారణమని ఆగ్మెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు, సిఇఒ గజేంద్ర నాగ్‌పాల్ తెలిపారు. మరోవైపు నవంబర్ నెలలో అమెరికా ఉద్యోగ గణాంకాలు బాగుంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉద్దీపన పథకాల ఉపసంహరణను డిసెంబర్ నెలలోనే ప్రారంభించే వీలుందని, కాబట్టి అగ్రరాజ్య ఉద్యోగ గణాంకాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వెరాసిటి బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌధరి పేర్కొన్నారు. సోమవారం తప్పకుండా స్టాక్‌మార్కెట్లు సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టస్థాయిని తాకుతాయని అశికా స్టాక్ బ్రోకర్స్ రీసెర్చ్ హెడ్ పరస్ బోత్రా విశ్లేషించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications