
కాగా నవంబర్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులను దేశీయ మార్కట్లలోకి తీసుకొచ్చారు. అయితే అక్టోబర్‌తో పోల్చితే నవంబర్‌లో ఎఫ్‌ఐఐ పెట్టుబడులు దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. అక్టోబర్‌లో 15,700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థాగత మదపర్లు సెప్టెంబర్‌లో 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. నవంబర్‌లో మొత్తం 55,806 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, తిరిగి 47,690 కోట్ల రూపాయల పెట్టుబడులు తిరిగి వెళ్లిపోయాయి.
దీంతో నికరంగా నవంబర్‌లోని విదేశీ పెట్టుబడులు 8,116 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. దీంతో 2013లో ఇప్పటిదాకా దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి వచ్చిన ఎఫ్‌ఐఐ పెట్టుబడులు 97,050 కోట్ల రూపాయలుగా ఉండగా..మరోవైపు రుణ మార్కెట్ల నుంచి నవంబర్‌లో 5,983 కోట్ల రూపాయలను ఎఫ్‌ఐఐలు లాగేసుకున్నారు.
ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి డెబ్ట్ మార్కెట్ల నుంచి ఔట్‌ఫ్లో 56,138 కోట్ల రూపాయలకు చేరింది. కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యలోటు ఆమోదయోగ్య స్థాయికి వస్తాయన్న విశ్వాసం కారణంగా మార్కెట్లకు లాభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా భారత్‌లో ఆరోగ్య సంరక్షణ రంగం వేగవంతంగా విస్తరిస్తోంది. 2012 సంవత్సరంలో ఈ రంగ పరిమాణం 7,860 కోట్ల డాలర్లుంది. 2017నాటికల్లా ఇది 15,820 కోట్ల డాలర్లకు పెరిగే అవకాశం ఉందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. వార్షికంగా 15 శాతం సగటు వృద్ధిని సాధిస్తున్న ఆరోగ్య సంరక్షణ రంగం 2008 సంవత్సరంలో 4,500 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్నట్టు ఈక్వెంటిస్ క్యాపిటల్ తన నివేదికలో స్పష్టం చేసింది.
టాటా మోటార్స్ విక్రయాల్లో భారీ క్షీణత
న్యూఢిల్లీ: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ విక్రయాలు నవంబర్ నెలలో మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. నవంబర్ నెలలో టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు 37,192 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు నవంబర్‌లో 62,354 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు కూడా 4,146 యూనిట్ల నుంచి 3,671 యూనిట్లకు పడిపోయాయి. మహింద్రా అండ్ మహింద్రా అమ్మకాలు సైతం నవంబర్‌లో 18 శాతం పడిపోయాయి. ఈసారి 39,255 యూనిట్ల అమ్మకాలు జరిపిన ఈ సంస్థ గత ఏడాది నవంబర్‌లో 48,143 యూనిట్ల విక్రయాలు జరిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications