మూరత్ ట్రేడింగ్ జోరు: రికార్డు స్థాయికి సెన్సెక్స్, నిఫ్టీ

నికరంగా 42.55 పాయింట్ల లాభంతో 21,239.36 వద్ద మార్కెట్ ముగిసింది. శుక్రవారం సెన్సెక్స్ ఇంట్రాడేలో సరికొత్త చారిత్రక గరిష్ఠ స్థాయి 21,293.88 పాయింట్లను తాకింది. వినియోగ వస్తువులు, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన స్టాక్‌లు పరుగులో ముందున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
సంవత్ 2070 సందర్భంగా కొత్త ఖాతాలు ప్రారంభించే ఉత్సాహంలో ఇన్వెస్టర్లు, ఫండ్ సంస్థలు కొత్త కొనుగోళ్లు జరిపారని బ్రోకర్లు తెలిపారు. ఆర్థిక స్థితి ఆశావహంగా మారడంతో పాటు విదేశీ ఫండ్ సంస్థల కొనుగోళ్ల నడుమ మార్కెట్ సెంటిమెంట్ గత కొద్ది రోజులుగా పాజిటివ్‌గా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
నిఫ్టీ సైతం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో 6,342.95 వద్దకు చేరగా, 2008 జనవరి 8న నమోదైన ఆల్‌టైమ్ ఇంట్రా-డే రికార్డు స్థాయి 6,357.10కు చేరువైంది. హెల్త్‌కేర్, ఆటో, మెటల్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల్లోని షేర్లు మదుపర్లను ఆకట్టుకుని లాభపడ్డాయి. విదేశీ మదుపర్లు మార్కెట్లలో 186.95 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. కాగా బలిప్రతిపదను పురస్కరించుకుని మార్కెట్లకు సోమవారం సెలవు దినం. మంగళవారం తిరిగి యధావిధిగా స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి.


Click it and Unblock the Notifications