
2010 జనవరి 10న 21,206.77 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఆ రికార్డును అధిగమించి శుక్రవారం సెన్సెక్స్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాగా బుధవారం 21,034 పాయింట్లకు చేరిన సెన్సెక్స్ గరువారం 21,164.52 స్థాయికి చేరింది. చివరి అరగంటలో మెరుగైన వినియమ వస్తువులు, పిఎస్‌యూ, బ్యాంకు షేర్ల కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ ఈ రికార్డు పాయింట్ల స్థాయికి చేరుకోగలిగింది.
జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 47.45 పాయింట్లు పెరిగి 6,299.15 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో ట్రేడింగ్ మధ్య (ఇంట్రా-డే)లో సెన్సెక్స్ 21,205.44 స్థాయికి చేరి 2008 జనవరి 10న ఇదే విధంగా ఆల్‌టైమ్ ఇంట్రా-డే హైగా నమోదైన 21,206.77 పాయింట్లకు సమీపంలోకి వెళ్లింది. అలాగే నిఫ్టీ కూడా గురువారం నాటి ఇంట్రా-డే ట్రేడింగ్‌లో 6,300 స్థాయిని దాటి గరిష్ఠంగా 6,309.05ను తాకింది.
నిఫ్టీ ఆల్‌టైమ్ ఇంట్రా-డే హై 2008 జనవరి 8న 6,357.10గా నమోదవగా, గరిష్ఠ ముగింపు స్థాయి ఆల్‌టైమ్ హై 2010 నవంబర్ 5న నమోదైన 6,312.45గా ఉంది. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపనాల కొనసాగింపుపై నెలకొన్న భయాలతో మెజారిటీ ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) హవా కొనసాగుతోంది. వరుసగా 19 సెషన్లలో కూడా వీరు భారీ ఎత్తున కొనుగోళ్లు జరిపారు. ఒక్క బుధవారంనాడే ఎఫ్ఐఐలు కొనుగోలు చేసిన షేర్ల విలువ 1,016.77 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారంనాటి ట్రేడింగ్‌పై ఇన్వెస్టర్లలో ఉత్కంఠ నెలకొంది. సెన్సెక్స్ పాత రికార్డులను బద్దలు చేస్తుందా? లేక లాభాల స్వీకరణ జరిగి నష్టాల పాలవుతుందా? అనే ప్రశ్నలు ఇన్వెస్టర్ల మదిలో నెలకొన్నాయి.
హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్: పొన్నాల
హైదరాబాద్ నగరంలో త్వరలో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు కాబోతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గూగుల్ ఏర్పాటు చేయబోయే క్యాంపస్ ఎక్కడనేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
గూగుల్‌తోపాటు అమెజాన్ కంపెనీ కూడా హైదరాబాద్‌కు రానుందని పొన్నాల తెలిపారు. ఈ రెండు దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తే నగరంలో సమాచార సాంకేతిక రంగం అభివృద్ధి మరింతగా జరుగుతుందని పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications