For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిక్కుల్లో ఎన్ఎస్ఈఎల్.. సీఈఓతో పాటు మరో ఐదుగురిపై వేటు

By Nageswara Rao
|

National Spot Exchange
ముంబై: సీఈఓ అంజనీ సిన్హాసహా మొత్తం టాప్ మేనేజ్‌మెంట్‌ను తొలగిస్తున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) తెలిపింది. తొలగించిన వారిలో సీఎఫ్‌ఓ శశిధర్ కోటియా, మరో ఐదుగురు ఉన్నారు. అంజనీ సిన్హా సహా ప్రస్తుతం కీలక హోదాల్లో ఉన్న అధికారులను, విభాగ అధిపతులను తొలగించాలని బోర్డు నిర్ణయించిందని.. వీరిపై విచారణ పెండింగ్‌‌లో ఉందని ఎన్ఎస్ఈఎల్ తన ప్రకటనలో పేర్కొంది. తొలి దశ చెల్లింపులలో విఫలంకావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్‌మెంట్లకు సంబంధించి తొలి దశలో భాగంగా చెల్లించాల్సిన రూ. 175 కోట్లలో రూ. 92 కోట్లను మాత్రమే సమకూర్చినందున యాజమాన్యంపైవేటు వేసినట్లు ఎన్‌ఎస్‌ఈఎల్ బోర్డు పేర్కొంది.

ఇక నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ విధులను నిర్వర్తించేందుకు ప్రత్యేక అధికారిగా పీఆర్ రమేష్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. సీఈఓ అధికారాలను రమేష్ కలిగి ఉండారని.. బోర్డుకు ప్రత్యక్ష జవాబుదారీగా వ్యవహరిస్తారని తెలిపింది. ఇది ఇలా ఉంటే తొలి దశ నగదు చెల్లింపుల్లో విఫలంకావడంతో ఎక్స్ఛేంజీ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతాయని ఎన్‌ఎస్‌ఈఎల్ బోర్డుకి ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్‌ఎంసీ) తెలియజేసింది.

తొలి దశ చెల్లింపులకు సంబంధించిన 15 మంది సభ్యులలో 9మంది విఫలమైనట్లు(డిఫాల్టర్స్) ఎన్‌ఎస్‌ఈఎల్ తెలిపింది. డిఫాల్టర్లలో ఆర్క్ ఇంపోర్ట్స్, లోయిల్ ఓవర్‌సీస్ ఫుడ్స్, లోటస్ రిఫైనరీస్, ఎన్‌కే ప్రొటీన్స్, ఎన్‌సీసీ షుగర్స్, స్పిన్ కాట్ టెక్స్‌టైల్స్, తవిషీ ఎంటర్‌ప్రైజెస్, విమలాదేవీ ఆగ్రోటెక్, యథురీ అసోసియేట్స్ ఉన్నాయి. మన రాష్ట్రానికి చెందిన బ్రోకింగ్ సంస్దలకు రూ. 83 కోట్ల వరకూ ఎన్ఎస్ఈఎల్ బకాయి పడిన విషయం గమనార్హం. ఈ తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకున్న మీదట ఈ మొత్తం వ్వవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు కేంద్ర ఆర్దిక శాఖ సన్నద్దమవుతున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ వర్గాలు అంటున్నాయి.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

చిక్కుల్లో ఎన్ఎస్ఈఎల్.. సీఈఓతో పాటు మరో ఐదుగురిపై వేటు | NSEL sacks CEO Anjani Sinha; pays only Rs 92 crore to investors

Crisis-ridden National Spot Exchange today sacked its Managing Director and CEO AnjaniSinha and six other top executives on a day it failed to meet the first scheduled repayment to investors.
Story first published: Wednesday, August 21, 2013, 14:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X