For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నగదు చెల్లింపుల డిఫాల్టర్లపై చర్యలు తీసుకోండి: ప్రభుత్వం

By Nageswara Rao
|

Money
న్యూఢిల్లీ: నగదు చెల్లింపులలో విఫలమైన (డిఫాల్టర్ల) కొనుగోలుదారులపై చర్యలు తీసుకుంటామని నేషనల్ స్పాట్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈఎల్)ను ప్రభుత్వం ఆదేశించింది. నేషనల్ స్పాట్ ఎక్సేంజ్ ప్రభుత్వానికి సమర్పించిన ప్రణాళిక ప్రకారం కొంత మంది కొనుగోలుదారులు నగదు చెల్లింపుల్లో విఫలమై ఉంటారని ప్రభుత్వం భావించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. డిఫాల్టర్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు వారి వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని కోరింది. ఇది ఇలా ఉంటే నేషనల్ స్పాట్ ఎక్సేంజ్ గిడ్డంగులలో ఉన్న సరుకులపై ఆడిట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇన్వెస్టర్లకు సంబంధించి రూ. 5,600 కోట్ల హామీదారు నేషనల్ స్పాట్ ఎక్సేంజ్ కావడంతో బాధ్యతలను పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్:

నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ వస్తువులపై స్పాట్ ట్రేడింగ్ వీలు కల్పించే అధ్బుతమైన ప్లాట్ ఫామ్. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ రెండింటి జాయింట్ వెంచరే ఈ నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్. భారతదేశంలో ఉన్న నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్, మల్టీ కమోటిడీ ఎక్స్ఛేంజ్‌ల మాదిరిగానే ఈ ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ పని చేస్తుంది.

ఇన్వెస్టర్లు ఎటువంటి సమస్యలు లేకుండా సాధారణ పెట్టుబడులు పెట్టాలంటే నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడులు పెట్టడం చాలా మంచింది. ఇందులో ప్రతి వంద గ్రాముల వెండిని ఒక యూనిట్‌ అంటే ఒక షేర్‌గా పరిగణిస్తారు. మన సామర్ద్యాన్ని బట్టి ఎన్ని యూనిట్లు కావాలంటే అన్ని యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలు చేసిన తర్వాత మామూలు షేర్ల లాగే మన డీమ్యాట్ ఖాతాలోకి వస్తాయి. అంతేకాకుండా మామూలు షేర్ల మాదిరే వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. వెండి కొనాలంటే డీమ్యాట్‌లోని యూనిట్లును సరెండర్ చేస్తే వెండిని ఇస్తారు (కొన్ని షరతులకు లోబడి). కాబట్టి వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఒక ఉత్తమమైన సాధనం.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

నగదు చెల్లింపుల డిఫాల్టర్లపై చర్యలు తీసుకోండి: ప్రభుత్వం | Put up defaulters list; will audit stocks Govt to NSEL

Government asks NSEL to reveal defaulters list on its website. Government also plans to audit warehouses of NSEL for stock claims.
Story first published: Tuesday, August 20, 2013, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X