
అసలు ఎవరెవరు ఆదాయ పన్ను క్రింద అర్హులు. గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ఈ ఆదాయ పన్ను పరిగణలోకి వస్తారు. ఐతే మన దేశంలో 18 సంవత్సరాలు నిండినప్పటికీ.. ఆదాయాన్ని సంపాదించే స్దాయిలో అందరూ ఉండరు. కాబట్టి వారి వార్షిక ఆదాయాన్ని బట్టి ప్రభుత్వం ఆదాయ పన్ను విధిస్తుంది. 18 సంవత్సరాల వయసు లేని వారిని మైనర్ అనే విషయం తెలిసిందే. అలాంటి మైనర్స్ కొన్ని ప్రత్యేకమైన పరిస్దితుల్లో తప్ప ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు.
18 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారు ట్యూషన్స్ లాంటి ఆదాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించినట్లైతే తప్పనిసరిగా ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు సంపాదించే ఆదాయం రూ. 2 లక్షలుకు పైగా ఉన్నట్లైతే పెద్దవారి మాదిరే వీరు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల వయసు లోపు ఉన్న మైనర్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే దానికి వివిధ మార్గాలున్నాయి. మీ తండ్రి గనుక మీ పేరు మీద బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేసినట్లైతే... దాని ద్వారా మీరు వడ్డీని పొందుతుంటే, ఈ ఆదాయాన్ని మీరు మీ సొంత ఆదాయంగా ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్‌లో చూపించుకోవచ్చు.
మైనర్ ఎప్పుడు కూడా సపరేట్‌గా ఆదాయాన్ని ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు టాక్స్‌ను ఫైలింగ్ చేసే సమయంలో మీ తండ్రి లేదా సంరక్షుడి పేరును ప్రస్తావించవచ్చు. ఆదే 18 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరూ ఆదాయాన్ని సంపాదిస్తుంటే తప్పనిసరిగా ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రూ. 2లక్షలకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తుంటే తప్పనిసరిగా రిటర్న్స్ దాఖలు చేయాలి. అదే రూ. 5 లక్షలు పైబడి మీ ఆదాయం ఉంటే ఎలక్ట్రానిక్ రూపంలో రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ అనేది ప్రస్తుతం ఆన్ లైన్‌లో కూడా దాఖలు చేసే వెసులుబాటుని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేసేందుకు చివరి తేదీ జులై 31గా ప్రభుత్వం నిర్ణయించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications