
వడ్డీ రేట్లను పెంచబోమంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెర్నాంకీ చెప్పడంతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అమెరికా ఆర్దిక వ్యవస్దకు పటిష్టంగా ఉండేందుకు గాను మరికొంతకాలంపాటు నామమాత్ర స్దాయిలోమే రేట్లను కొనసాగించనున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆసియా సహా యూరప్‌లోని పలు స్టాక్ మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ 163 పాయింట్లు లాభపడుతూ ఈరోజు 19,839 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే విధంగా నిప్టీ కూడా గరిష్టంగా 25 పాయింట్ల వరకూ లాభ పడుతూ 5,960 వద్ద ట్రేడ్ అవుతుంది. సెంటిమెంట్ సానుకూలంగా మారడంతో.. నిన్న ఒక్కరోజు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు రూ. లక్ష కోట్లు జమ అయింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 65 లక్షల కోట్లకు చేరింది.
గత కొన్ని వారాలుగా అమెరికా వ్యవస్ద పుంజుకుంటున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆందోళనకు చెందారు. ప్రపంచ ఆర్దిక వ్యవస్దకు పెద్ద దిక్కుగా పని చేసే అమెరికా ఆర్దిక వ్యవస్ద పుంజుకోవండ సంతోషించాల్సిన విషయం. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే సహాయక ప్యాకేజీలను నిలిపివేయడంతోపాటు, వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయంటూ బెర్నాంకీ ఇటీవలే వెల్లడించారు. దీంతో అటు పసిడితోపాటు, ఇటు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. సహాయక ప్యాకేజీలను కొనసాగించే సంకేతాలను ఇవ్వడం ద్వారా బెర్నాంకీ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చారని విశ్లేషకులు పేర్కొన్నారు. మందగమనంలో ఉన్న ఆర్దిక వ్యవస్దకు ఊపనిచ్చేందుకు అమెరికా కేంద్ర బ్యాంక్ సహాయక ప్యాకేజీలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications