న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ భారత్‌లో విమాన సర్వీసులను ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రారంభించగలమని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం విమానయాన మంత్రి అజిత్ సింగ్‌ను కలిసిన అనంతరం టోనీ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ పౌర విమానయాన శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం లభించిన తర్వాత సత్వరమే ఫ్లయింగ్ లెసైన్సు కూడా తెచ్చుకోగలమని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇంధన వ్యయాలు భారీగా ఉన్నప్పటికీ.. ఎక్కువ స్థాయిలో ప్రయాణికులను పెంచుకోవడం ద్వారా ఛార్జీలు తక్కువగా ఉన్నప్పటికీ.. లాభాలను సాధించగలమని ధీమాని వ్యక్తం చేశారు.
దీనితోపాటు ఎయిర్ ఏషియా ట్యూన్ మనీ ద్వారా భారతదేశం యొక్క భీమా మార్కెట్‌లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఎయిర్ లైన్స్ బిజనెస్‌కు, భీమా బిజినెస్ రెండు సపరేట్‌గా నిర్వహిస్తామన్నారు. ఎయిర్ ఏషియా ఇండియా ఆపరేషన్స్ మొదలైన తర్వాత ఫ్రీ టిక్కెట్స్ కూడా అందజేస్తామన్నారు. ఎయిర్ ఏషియా ఇండియా ఎలా ఉండబోతుందంటే 'ప్రెష్ బ్రీడ్ అండ్ హాట్ ఫుడ్'. ఒక్క మాటలో చెప్పాలంటే బిర్యాని మాదిరి. ఇక ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిత్తు చాండిల్య మాట్లాడుతూ ఏదో ఒక రోజు ఎయిర్ ఏషియా ఇండియా... ఎయిర్ ఏషియా గ్రూప్ కంటే పెద్దదిగా అవతరిస్తుందన్నారు. తక్కువ ఛార్జీలు, ఇతర విషయాలను అర్దం చేసుకునేందుకు నాకు గొప్ప అవకాశమని అన్నారు.

రూ. 80 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమవుతున్న ఈ జేవీలో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ఏషియా 49 శాతం, టాటాసన్స్ 30 శాతం, టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ 21 శాతం పెట్టుబడులు పెట్టి కొత్త ఎయిర్‌లైన్‌ను ప్రారంభిస్తాయని ఎయిర్ ఏషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మలేషియా కంపెనీ తొలివిడతలో 3 నుండి 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తీసుకురానుంది. ఎయిర్ ఏషియా ప్రాథమిక పెట్టుబడిగా సుమారు రూ. 275 కోట్లు వెచ్చించనుంది. ప్రతిపాదిత చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియాకి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎయిర్ ఏషియా సలహాదారు రతన్ టాటాతో కలిసి నిన్న టోనీ ఫెర్నాండెజ్ కేంద్ర మంత్రులు ఆర్థిక మంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్, వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మతో భేటీ అయ్యారు. ఈ సమావేశాలు సానుకూలంగా సాగాయని ఫెర్నాండెజ్.. ట్విటర్‌లో చెప్పారు.
టాటాలతో కలసి మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ (జేవీ) పేరుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. ఈ జాయింట్ వెంచర్‌కు ఎయిర్ ఏషియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ పేరును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. మహారాష్ట్రలో కంపెనీ ఈ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంది. మొదటగా 3-4 ఎయిర్‌బస్ ఏ-320 విమానాలతో సర్వీసులను ప్రారంభించి ఆతర్వాత వీటి సంఖ్యను వేగంగా పెంచుతామన్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా ఈ ఎయిర్‌లైన్స్ నడవనుందని ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications