
(How to update your aadhaar card information online)
ఈ విషయంపై స్పందించిన ఐగేట్ యాజమాన్యం తాజాగా పన్ను డిమాండ్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ విషయంపై దీనికి సంబంధించిన విచారణ అధికారులను ఆశ్రయించనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్ద యుఎస్ సెక్‌కు తెలిపింది. ఇన్పోసిస్‌కు రూ. 577 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నోటీసులు జారీ చేసింది. 2009వ ఆర్దిక సంవత్సరానికి సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసు పంపించింది. ఇప్పటికే 2005 నుండి నాలుగు సంవత్సరాల పాటు అదనపు ఆదనంగా దాదాపు రూ. 1,175 కోట్ల పన్నులు చెల్లించాలని ఐటీ విభాగం పంపించిన డిమాండ్ నోటీసులపై ఇన్పోసిస్ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.
ఆదాయపు పన్నుశాఖ 2009 ఆర్థిక సంవత్సరానికి గాను మే 2, 2013న 106 మిలియన్ డాలర్లకు డిమాండ్ ఆర్డరు పంపించిందని ఇన్ఫోసిస్ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కి గత వారం తెలియజేసింది. తాజాగా 2009-10 సంవత్సరానికి సంబంధించిన నోటీసుపైనా న్యాయస్దానాన్ని ఆశ్రయిస్తామని ఇన్పోసిస్ తెలిపింది.
ఆదాయ పన్ను చట్ట ప్రకారం సెక్షణ్ 10ఏలో విదేశాలకు చేసిన ఎగుమతుల టర్నోవర్‌పై రాయితీ ఉంటుందని... కంపెనీ మొత్తం టర్నోవర్‌పై రాయితీని తీసుకుందని దీనికి గాను మొత్తం 214 మిలియన్ డాలర్లు పన్నుతో పాటు 62 మిలియన్ డాలర్ల జరిమానా కూడా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది. ఈ విషయంపై కోర్టులో సవాలు చేస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. కాగా 2012-13 ఆర్దిక సంవత్సరానికి ఇన్పోసిస్ వీసా సంబంధిత ఖర్చులు 50 శాతానికి పెరిగి, రూ. 308 కోట్లకు చేరుకున్నాయి. 2011-12లో వీసా సంబంధిత ఖర్చులు రూ. 202 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల కఠినమైన వీసా నిబంధనల వల్ల భారత ఐటీ కంపెనీల మార్జిన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications