
ఈ సందర్బంలో మిత్తు చాండిల్య మాట్లాడుతూ తాను చెన్నై వాసినని... భారత్‌కు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. భారత విమానయాన రంగంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలకనున్న ఎయిర్ ఏషియాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని అన్నాడు. ఎయిర్ ఏషియాను చాండిల్య విజయవంతమైన సంస్థగా నిర్వహించగలరన్న ధీమాను టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా వ్యక్తం చేశారు. చెన్నై నుండి ఒక స్మార్ట్ బాయ్‌ని సీఈఓగా నియమించామని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు. చాండిల్య మంచి వాణిజ్య నైపుణ్యాలున్న వ్యక్తని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ ఫెర్నాండెజ్ పేర్కొన్నారు.
కంపెనీ ఎదిగే కొద్ది మరింత మందిని ఉద్యోగంలో తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ప్రతి ఎయిర్ క్రాప్ట్‌కి సుమారు 20 మందిని తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విమానయాన సంస్ద సేవలు ప్రారంభించగదలని ఇటీవల మలేసియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తెలిపిన విషయం తెలిసిందే.
రూ. 80 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమవుతున్న ఈ జేవీలో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ఏషియా 49 శాతం, టాటాసన్స్ 30 శాతం, టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ 21 శాతం పెట్టుబడులు పెట్టి కొత్త ఎయిర్‌లైన్‌ను ప్రారంభిస్తాయని ఎయిర్ ఏషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మలేషియా కంపెనీ తొలివిడతలో 3 నుండి 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తీసుకురానుంది. ఎయిర్ ఏషియా ప్రాథమిక పెట్టుబడిగా సుమారు రూ. 275 కోట్లు వెచ్చించనుంది. ఈ ఎయిర్‌లైన్స్ తక్కువ చార్జీల విధానాన్నే కస్టమర్స్‌కు అందిస్తుంది. మొదటగా 3-4 ఎయిర్‌బస్ ఏ-320 విమానాలతో సర్వీసులను ప్రారంభించి ఆతర్వాత వీటి సంఖ్యను వేగంగా పెంచుతామన్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా ఈ ఎయిర్‌లైన్స్ నడవనుందని ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు. భారత్‌లో ఎయిర్‌ఏషియా జెట్ ఎయిర్‌వేస్, స్పయిస్‌జెట్, ఇండిగో, గో ఎయిర్‌తో పాటు ఎయిర్ ఇండియాతో పోటీపడతాయి.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications