జూన్ 1 నుండి రూ. 2 లక్షల నగదు కొనుగోలు బంగారంపై ఒక శాతం టాక్స్

(Gold prices on May 3 across Indian cities)
ఫైనాన్స్ బిల్లు 2013లో రూపొందించిన కొత్త విధి విధానాలు జూన్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బంగారు నాణేలు అటు బులియన్‌లో కానీ ఇటు జ్యూయలరీలో కానీ చేర్చలేదు. బంగారు నాణేలు రూ. 2 లక్షల విలువ కంటే ఎక్కువ మొత్తంలో టీసీఎస్ లేకుండా అమ్ముడవుతున్నాయని అన్నారు. మంగళవారం ఈ విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావించిన ఆర్దిక మంత్రి మేము కొత్తగా నిబంధనలను ఏమీ రూపొందించడం లేదు. గతంలో ఉన్న నిబంధనలనే అమలు చేస్తున్నామన్నారు. 10 గ్రాములు లేదా అంతకంటే తక్కువ బరువు కలిగిన నాణేలు, ఆభరణాలపై గతంలో ఉన్న విధివిధానాలనే ఉంటాయన్నారు.
వీటితో పాటు మరింత మందిని పన్నుల పరిధిలోకి తీసుకువచ్చి, వసూళ్లను పెంచేందుకు ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని ఆర్థికమంత్రి అన్నారు. మూడు నెలల కాలంలో 50 లక్షల మందిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. రాజ్యసభలో బడ్జెట్ ఆమోదానికి ముందు జరిగిన సమావేశంలో ఆర్థికమంత్రి ఈ అంశాలను వెల్లడించారు.
భారతదేశానికి చెందిన ప్రధాన నగరాల్లో ఈరోజు (మే 3)న 24 క్యారెట్ల బంగారం ధరలు ఈ క్రింద విధంగా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 27,300
ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 27,210
ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 27,180
చెన్నై: 10 బంగారం ధర రూ. 27,300
కోలకతా: 10 బంగారం ధర రూ. 27,260
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 27,350
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications