హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాల స్దాయిలో ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ సర్వీసులందించే ఐదు అత్యున్నత విమానాశ్రయాలలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్టులు స్దానాన్ని దక్కించుకున్నాయి. 2012 సంవత్సరానికి గాను ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ప్రకారం సియోల్‌లోని ఇంచియోన్ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత జీఎంఆర్ గ్రూప్ సారథ్యంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ) రెండో స్థానంలో, జీవీకేకి చెందిన ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ముంబై) మూడో స్థానంలో నిలిచాయి. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 25-40 మిలియన్ ప్రయాణీకులకు తన సేవలను అందిస్తుంది.
మరోవైపు, 5-15 మిలియన్ ప్రయాణీకుల విభాగంలో జీఎంఆర్‌కి చెందిన రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (హైదరాబాద్) రెండో స్థానంలో ఉండగా, జపాన్‌కి చెందిన నగోయా ఎయిర్‌పోర్టు తొలి స్థానంలో ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ ఎయిర్‌పోర్టుల జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం నాలుగో స్థానం దక్కించుకుంది. దీనితో పాటు దేశంలోని ద్వితీయశ్రేణి ఎయిర్‌పోర్టుల్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు ఉత్తమ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ అవార్డును ప్రదానం చేయనుంది. విశాఖ ఎయిర్‌పోర్టు అనేక ఇబ్బందులను అధిగమించి, ఈ అవార్డును సాధించింది. సుమారు ఐదు సంవత్సరాల కిందట విశాఖ నగరానికి వరదలు వస్తే, విమానాశ్రయం మునిగిపోయేది. రన్‌వేపై వరద నీరు ప్రవహించేది.
దట్టమైన పొగ మంచు కురిస్తే, విమానాలు ల్యాండ్ కాలేక, గాలిలోనే చక్కర్లు కొట్టేవి. అటువంటి విమానాశ్రయంలో ఇటీవల సుమారు 200 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక రన్ వే ఏర్పాటు చేసి, నైట్ ల్యాండింగ్ సదుపాయాన్ని కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లాంజ్‌ను తయారు చేశారు. ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధులు సింగపూర్, దుబాయ్ విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరపడంతో ప్రస్తుతం ఈ రెండు దేశాలకు సంబంధించిన విమానాలు విశాఖలో ల్యాండ్ అవుతున్నాయి.
వన్ఇండియా తెలుగు మనీ
Share This Article
English summary
ప్రపంచపు టాప్ 5 ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై | Delhi, Mumbai, Hyderabad airports among world's top 5 | అత్యుత్తమ సర్వీసులందించే ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్
Airports Council International (ACI), a global body of airports, has adjudged Delhi's Indira Gandhi International (IGI) airport as second best after Seoul's Incheon airport in the category of airports handling 25-40 million passengers per annum (MPPA) for their service quality for the year 2012.
Story first published: Wednesday, March 13, 2013, 13:04 [IST]
Other articles published on
Mar 13, 2013