ఐటీ పన్ను మినహాయింపు 3 లక్షలకు పెంచాలి: వేతన ఉద్యోగులు

Budget 2013: Salaried class employees want FM to raise IT exemption limit, says ASSOCHAM
న్యూఢిల్లీ: మార్చి నెల సమీపిస్తున్న తరుణంలో ఆదాయం పన్ను మినహాయింపును మూడు లక్షల రూపాయలకు పెంచాలని వేతన తరగతి ఉద్యోగులు కోరుతున్నారని వివిధ పట్టణాల్లో వాణిజ్య, పరిశ్రమ సంస్ద ఆయినటువంటి అసోచామ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వచ్చే ఆర్దిక సంవత్సరంలో కేంద్రంలో ప్రవేశపెట్టనున్న "బడ్జెట్ 2013"లో ఆదాయం పన్ను మినహాయింపును 2 లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచాలని, మహిళలకు 3.50 లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నట్లు అసోచామ్ పేర్కొంది.

దీనితో పాటు మెడికల్ బిల్లులు, చదువుకి సబంధించిన అలెవెన్స్‌లు పరిమితిని కూడా పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. మెడికల్ బిల్లుల మినహాయింపు పరిమితిని 50 వేల రూపాయలకు పెంచాలని సూచించారు. రవాణా అలవెన్సు పన్ను మినహాయింపుపరిమితిని నెలకు 800 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెంచాలని ఉద్యోగులు వారి కోరికను తెలిపారని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు.

హౌసింగ్‌పై ఆదాయం పన్ను మినహాయింపు 1.50 లక్షల రూపాయల నుంచి 2.50 లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. పై విషయాలను18 విభాగాలపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించడం జరిగిందని అసోచామ్ వివరించింది. ఇక మౌలిక సదుపాయాల బాండ్లపై పెట్టుబడులకు సంబంధించి ఆదాయం పన్ను మినహాయింపును 20 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలకు పెంచాలన్నారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+