కంపెనీలు సేవా పన్ను చెల్లించకుంటే చర్యలు: సీబీఈసీ

కొన్ని సంస్థలు.. తమ క్లయింట్ల దగ్గరనుంచి సేవా పన్ను వసూలు చేస్తున్నా, ఆ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి జమ చేయకుండా ఎగవేస్తున్నాయని పేర్కొంది. గత ఆరు నెలలుగా చూస్తే.. చమురు.. గ్యాస్ రంగ కంపెనీల నుంచి రూ. 150 కోట్లు, నిర్మాణ రంగ సంస్థల నుంచి రూ. 18 కోట్లు, సెక్యూరిటీ సర్వీసుల నుంచి రూ. 86 కోట్లు, ఫార్మా రంగం నుంచి రూ. 10 కోట్ల మేర ఎగవేతలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు సీబీఈసీ తెలిపింది.
రెవిన్యూ అధికారులతో ఇటీవల జరిగిన సమావేశంలో పి చిదంబరం మాట్లాడుతూ బడ్జెట్ లక్ష్యాన్ని చేరేందుకు పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది రెవెన్యూశా కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొవాల్సి ఉంటుందని ఎందుకంటే తయారీరంగం డీలాపడ్డంతో దిగుమతులు తక్కువగా ఉన్నాయని చిదంబరం అన్నారు. ఆయన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎకై్సజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) అధికారుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. మార్చి చివరిలోగా ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా ఏడు వారాల సమయం ఉంది..
ఈ ఆర్థిక సంవత్సరం రూ.5.05 లక్షల కోట్ల లక్ష్యాన్ని ఆర్థికశాఖ విధించింది. వాటిలో పరోక్షపన్నులు, వాటిలోనే ఎక్సైజ్, కస్టమ్స్, సేవా పన్ను కలిసి ఉంటాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 27 శాతం లక్ష్యాన్ని పెంచారు. పన్ను వసూలు చేసే టాక్స్ కలెక్టర్లకు ఈ ఏడాది పలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. పరోక్ష పన్నులు ఏప్రిల్ -నవంబర్ కాలంలో స్వల్పంగా 16.8 శాతం పెరిగి రూ. 2.92 లక్షల కోట్లకు చేరాయి అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ. 2.50 లక్షల కోట్లు వసూలు చేశారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications