
ఫలితంగా డిసెంబర్‌లో వాణిజ్య లోటు 17.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో గత మాసంలో ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 1,770 కోట్ల డాలర్లుగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 1,470 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ఎగుమతులపై ప్రభావం చూపుతుందని వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ ఆర్ రావు అన్నారు. గతేడాది 2012లో ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2.5 శాతంగా నమోదయ్యిందని రావు పేర్కొన్నారు. దీంతో ఇది 20 ఏళ్ల కనిష్టానికి పతనమయ్యిందన్నారు. అయితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2012-13లో వృద్ధి రేటు 4.5 శాతంగా ఉంటుందని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంచనా వేసిందన్నారు. మొత్తం 2013లో ఇది 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
2012-13 ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో జరిగిన ఎగుమతుల్లో ఔషధ రంగం 10.7 శాతం, ఇంజనీరింగ్ 4.4 శాతం, పెట్రోలియం ఉత్పత్తులు 4.1 శాతం, రత్నాలు, ఆభరణాలు 10.6 శాతం, టెక్స్‌టైల్స్ 8.4 శాతం మేర వృద్ధి చెందాయని పేర్కొన్నారు. దిగుమతుల్లో సాధారణంగానే ముడి చమురు 12.18 శాతంతో అత్యధిక స్థానంలో నిలిచింది. అయితే గతంతో పోల్చితే బంగారం, వెండి దిగుమతులు 15 శాతం పడిపోయాయని, అలాగే మెషినరీ 5 శాతం, ఎలక్ట్రానిక్స్ 9 శాతం, ముత్యాలు, ఇతరత్రా విలువైన రత్నాలు 36 శాతం పడిపోయాయి. ముఖ్యంగా కరెంటు ఖాతా లోటు ఆందోళరకర స్థాయికి పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన చర్యలతో 2012 ఏప్రిల్-డిసెంబర్‌లో 39 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, వెండి దిగుమతులు జరగగా, 2011 డిసెంబర్‌లో వీటి విలువ 46 బిలియన్ డాలర్లుగా ఉంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications