గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై దేశీయ పారిశ్రామిక రంగం ప్రశంసల వర్షం కురింపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీతోపాటు ఆయన సోదరుడు, అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, టాటా గ్రూప్ మాజీ అధినేత రతన్ టాటా పారిశ్రామిక రంగానికి మోడీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసించారు. పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తూ నిర్వహిస్తున్న మూడు రోజుల వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ - 2013 శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ వౌలిక రంగ వసతుల కల్పనలో గుజరాత్ దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
గుజరాత్‌లోనే మా ప్రస్థానం మొదలైందన్నరిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సైతం.. నరేంద్ర మోడీని స్పష్టమైన విజన్, దానికి వాస్తవ రూపం ఇవ్వగల నేతగా పేర్కొన్నారు. తాము గుజరాత్‌లో రూ. 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామన్నారు. రిలయన్స్‌ను గుజరాత్‌కు చెందిన సంస్థగా చెప్పుకోవడం గర్వకారణంగా ఉంటుందన్నారు. గుజరాత్‌లో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ.. గుజరాత్ గడ్డపై పుట్టిన మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వంటి మహా నేత లు, ధీరుభాయ్ అంబానీ వంటి పారిశ్రామిక దిగ్గజం స్థాయి గల వ్యక్తిగా మోడీని ప్రశంసించారు.

ఇక టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సైతం మోడీపై ప్రశంసలు కురిపించారు. పారిశ్రామిక పెట్టుబడులకు గుజరాత్ దేశంలోనే ఎంతో అనువైనదన్న ఆయన రాష్ట్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ఘనత మోడీదేనన్నారు. మొదటిసారి గుజరాత్‌కు వచ్చినప్పుడే ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోవడం తెలివితక్కువతనమే అవుతుందన్నారు. ఐతే ప్రస్తుతం గుజరాత్‌లో టాటా గ్రూప్ 34,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టిందన్నారు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సు తొలి రోజున రూ. 28,000 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. 2011లో జరిగిన సదస్సుకు హాజరైన 52,000 మందితో పోలిస్తే డెలిగేట్ల సంఖ్య 15,000 పెరిగింది. అప్పట్లో రూ. 20.83 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా 8,000 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
తాజా సదస్సు విషయానికొస్తే.. ఇప్పటికే గుజరాత్‌లో రూ. 88,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎస్సార్ గ్రూప్ మరో రూ. 14,000 కోట్లు, అదానీ గ్రూప్ రూ. 5,000 కోట్లు, ఏబీజీ షిప్‌యార్డ్ రూ. 7,000 కోట్లు , జూబిలెంట్ లైఫ్‌సెన్సైస్ వచ్చే రెండేళ్లలో రూ. 1,300-1,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ పెట్రోలియం యూనివర్సిటీపై మరో రూ. 500 కోట్లు పెట్టుబడి పెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. టాటా గ్రూప్ ఇప్పటికే రూ. 34,000 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రక్రియలో ఉంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications