
2012లో సుమారు 7 లక్షల ఉద్యోగాలు జరిగాయి. 2013 కొత్త సంవత్సరంలో కనీసం 5-6 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉద్యోగాలు రావొచ్చు. ఆర్థిక అనిశ్చితి కారణంగా ఇటు ఉద్యోగార్థులకు గానీ అటు కంపెనీలకు గానీ 2012 పెద్దగా కలిసిరాలేదని మైహైరింగ్‌క్లబ్.కామ్ సంస్థ సీఈవో రాజేష్ కుమార్ చెప్పారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), రిటైల్, వైద్యం, విద్య, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఇంధన తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు చాలానే ఉండొచ్చని అప్నాసర్కిల్ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో యోగేష్ బన్సల్ తెలిపారు.
మెరుగైన పనితీరును కనపర్చే ఉద్యోగులకు 10-15 శాతం మేర ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు కూడా కంపెనీలు వెనుకాడవని మ్యాన్‌పవర్ ఇండియా ఎండీ ఏజీ రావు చెప్పారు. విద్యుత్, ఇంధనం, రిటైల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వైద్యం, సరకు రవాణా, బ్యాంకింగ్ తదితర రంగాల్లో రిక్రూట్‌మెంట్ భారీగా ఉండొచ్చని గ్లోబల్‌హంట్ ఇండియా ఎండీ సునీల్ గోయల్ తెలిపారు.
ప్రభుత్వ రంగంలో భారీ స్దాయి నియామకాలకు ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకుల్లో ఈసారి 50,000-60,000 వరకూ ఉద్యోగాలు రానున్నాయి. ఒకవేళ కొత్త సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్సులు ఇచ్చిన పక్షంలో ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో కూడా రిక్రూట్‌మెంట్లు అధికంగానే ఉండొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ ఫైనాన్షియల్ రంగ సంస్థల్లో నియామకాలు అంతంత మాత్రంగానే జరిగాయని, మరిన్ని ఉద్యోగాలను కల్పించే అవకాశముందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ వైస్-ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications