కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ విజయ్ మాల్యా 6 విమానాలను జప్తు

ఈ రెండింటిలో ఒక దాన్ని నిన్న(మంగళవారం) స్వాధీనం చేసుకున్నట్లు ముంబై సర్వీస్ ట్యాక్స్ కమీషనర్ ఎస్‌కె సోలంకి మీడియాకు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధికారులు లీజుతో పాటు పన్నులు చెల్లించనందుకు 5 విమానాలను కోల్పోవాల్సి వచ్చిందని కింగ్‌ఫిషర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐతే సర్వీస్ ట్యాక్స్ విభాగం ఈ విధంగా విమానాలను జప్తు చేయడం చట్ట విరుద్దమంటూ కింగ్‌ఫిషర్ తెలిపింది.
కంపెనీ రూ. 190 కోట్ల మేర సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా.. ఇందులో రూ. 127 కోట్ల మొత్తంపై వివాదం నడుస్తోంది. కింగ్‌ఫిషర్ వద్ద ఉన్న 42 విమానాల్లో ఆరు ఎయిర్‌బస్ విమానాలను ఐఎల్‌ఎఫ్‌సీ లీజుకి ఇచ్చింది. కింగ్‌ఫిషర్ ప్రస్తుతం 17 బ్యాంకులకు రూ. 7,000 కోట్ల మేర రుణాలు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు పన్ను బకాయిలు, వెండార్లకు చెల్లించాల్సినవి, నష్టాలు కలిపి రూ. 10,000 కోట్లు ఉంటాయని అంచనా.
తమ సంస్థకు ఈక్విటీ భాగస్వామి కోసం అన్వేషిస్తున్నామని, ఈవిషయంమై పలు కంపెనీలతో సంప్రతింపులు జరుగుతున్నా ఇప్పటివరకు ఎవరితోనూ ఎలాంటి ఒప్పందం కుదరలేదని కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ వెల్లడించింది. ఎతిహాద్ ఎయర్‌వేస్ సహా వివిధ కంపెనీలతో ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని కంపెనీ బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కి తెలియ జేసింది. విషయం ఇంకా చర్చల స్థాయ లోనే వుందని ప్రకటనలో తెలిపారు. ఇతి హాద్‌కు రూ.3వేల కోట్ల వ్యయంతో 48% వాటాను విక్రయ స్తున్నట్లుగా వార్తలు వచ్చిన నేపధ్యంలో కింగ్‌ఫిషర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications