జీఎంఆర్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉల్లంఘనల ఆరోపణలను ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సంస్థ జీఎంఆర్ సంస్దలో ఈరోజు ఉదయం నుండి న్యూఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై తదితర కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపారని జీఎంఆర్ సంస్ద పత్రిక ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్బంలో జీఎంఆర్ ప్రతినిధులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఐటీ శాఖ అధికారులు తమ సంస్దల్లో ఉన్న పుస్తకాలను కూలంకుషంగా పరిశీలించారని తెలిపారు. ఈ సోదాలలో మా సంస్దకు చెందిన అన్ని పుస్తకాలు సక్రమంగానే ఉన్నాయని, సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు.
ఇండియాలో మౌలిక సదుపాయాల సంస్థగా పేరుగాంచిన జీఎంఆర్ సంస్దకు టర్కీ, సింగపూర్, ఇండోనేషియా, మాల్దీవులు, దక్షిణాఫ్రికా మరియు నేపాల్‌లో బిజినెస్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇక జీఎంఆర్ సంస్ద విషయానికి వస్తే బెంగుళూరు ప్రధాన కార్యాలయంగా ఎయిర్ పోర్ట్స్, ఎనర్జీ, నేషనల్ హైవేలు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మిస్తుంది. దేశంలో ఎంతో పేరుగాంచిన న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్, బెంగుళూరు విమానాశ్రయాలను ఈ సంస్దే నిర్మించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications