ముంబైలోని డెక్కన్ క్రానికల్ బిల్డింగ్ అమ్మకంపై బాంబై హైకోర్టు స్టే

Bombay HC bars Deccan Chronicle from selling Mumbai property on Tata Capital's plea
ముంబై, సెప్టెంబర్ 5: ఆర్దిక సమస్యలతో సతమతమవుతున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కి మరో దెబ్బ తగిలింది. టాటా క్యాపిటల్‌కి రూ. 101 కోట్ల రుణాల బకాయిలు ఉన్న వివాదానికి సంబంధించి ముంబైలో ఉన్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్‌ఎల్) బిల్డింగ్‌ను అమ్మకుండా ఆపివేస్తూ బాంబే హైకోర్డు ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లలో డీసీహెచ్‌ఎల్ ఖాతాలను స్తంభింపజేసి, ఈ అకౌంట్లలో రూ. 5 కోట్ల వరకూ మాత్రమే లావాదేవీలను అనుమతించాలని న్యాయస్థానం సూచించినట్లు టాటా క్యాపిటల్ తరఫు లాయర్ అశోక్ పరాంజపే తెలిపారు.

తమ ఆస్తులను అఫిడవిట్లో సమర్పించాల్సిందిగాడెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌ సంస్థ డెరైక్టరైన వెంకట్రామిరెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. డీసీహెచ్‌ఎల్ తమ వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో, తదుపరి విచారణ కేసుని ఈ నెల 27కి వాయిదా వేసింది. డీసీహెచ్‌ఎల్‌కి టాటా ఫైనాన్స్.. టర్మ్ రుణాన్ని ఇచ్చింది. అయితే, డీ సీహెచ్‌ఎల్ దీన్ని సకాలంలో చెల్లించలేకపోవడంతో టాటా ఫైనాన్స్ బాంబే హైకోర్టులో ఆర్బిట్రేషన్ పిటీషన్ వేసింది.

కేసుని విచారించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌జె కథావాలా పైన తెలిపిన ఆదేశాలు జారీ చేశారు. ఇక ముంబైలో డీసీహెచ్‌ఎల్ భవంతి విషయానికొస్తే.. లోయర్ పరెల్ ప్రాంతంలో కంపెనీకి 2,152 చదరపు గజాల్లో ఈ భవనం ఉంది. దీన్నే టాటా ఫైనాన్స్‌కి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌ తనఖా పెట్టి రుణం తీసుకుంది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+