
డెవలప్‌మెంట్ సెంటర్లపై పన్నుల విషయంలో అనుసరించాల్సిన విధానాలను ఖరారు చేసేందుకు ఈ కమిటీ సంబంధిత రంగ వర్గాలు, ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు జరుపుతుంది. ఐటి డైరెక్టర్ జనరల్ అనితా కపూర్, డిఐటి (టిపి) రష్మీసహానీ సక్సేనాలతో పాటు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఒక అధికారిని ఇందులో భాగం చేస్తామని పిఎంఒ తెలియజేసింది. ఆగస్టు 31 నాటికి సిఫార్సులు సమర్పిస్తుందని ప్రధాని కార్యాలయం (పీఎంవో) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
దేశవాళీ సాఫ్ట్‌వేర్ సంస్థలు 'ఆన్‌సైట్ సర్వీసెస్' విషయంలో నెకొన్న సందిగ్ధతలను తీర్చే ప్రయత్నం చేస్తామని, 2010 బడ్జెట్‌లో ప్రకటించిన 'సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్'పై కూడా తుది నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపింది. పన్ను భారాలను తగ్గించుకునేందుకు ఎంఎన్‌సీలు ఈ విధానం అనుసరిస్తుంటాయి. దేశీ సాఫ్ట్‌వేర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు... డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు, పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేలా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన పారదర్శక పన్ను విధానాలను ప్రవేశపెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని పీఎంవో వివరించింది.
పన్ను సంబంధ అంశాలను సమీక్షించేందుకు కమిటీని వేయడాన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ స్వాగతించింది. ఇది ఐటీ రంగ సంస్థల ఆందోళనలను తొలగించేందుకు దోహదపడగలదని నాస్కామ్ ప్రెసిడెంట్ సోమ్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను ఎగవేత నిరోధించేందుకు ఉద్దేశించిన గార్ నిబంధనలపై ఏర్పాటైన కమిటీ విచారణాంశాల పరిధిని పెంచుతూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపరమైన అంశాలపై స్పష్టత తెచ్చే ఉద్దేశంతో వాటిని కూడా ఇందులో చేర్చినట్లు పీఎంవో పేర్కొంది. సెప్టెంబర్ 30కల్లా గార్ మార్గదర్శక ప్రణాళికను రూపొందించేందుకు.. ట్యాక్సేషన్ నిపుణుడు పార్థసారథి షోమ్ సారథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. గార్‌పై విదేశీ ఇన్వెస్టర్ల ఆందోళన నేపథ్యంలో దీన్ని వచ్చే ఏప్రిల్‌కి వాయిదా వేశారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications