
ఒక్క ము ఖేష్ అంబానీ నేతృత్వంలో నడుస్తు న్న రెండు సంస్థల నుంచే రూ.1,500 కోట్ల పెట్టుబడులు ఎగిరిపోవడం గమనిస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో ఎఫ్‌ఐఐల వాటా 17.55 శాతం నుంచి 17 శాతానికి, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో 6.24 శాతం నుంచి 5.32 శాతానికి పడిపోయాయి.
ఇక అనిల్ అంబానీ సం స్థల విషయానికొస్తే అనిల్ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యునికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్, రిలయన్స్ మీడియా వర్క్స్‌లలో ఎఫ్‌ఐఐల వాటా క్షీణించింది. ఆర్‌కమ్‌లో 7.4 నుంచి 6.98 శాతానికి, క్యాపిటల్‌లో 21 నుంచి 20కి, బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్‌లో 1.4 నుంచి 1.35కు, మీడియా వర్క్స్‌లో 0.19 నుంచి 0.14 శాతానికి ఎఫ్ ఐ ఐలు తమ వాటాలను తగ్గించుకున్నారు. ఇవేగాక రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాలలోనూ కొంత తగ్గుదల నమోదైంది. దీంతో ఒకేసారి ఇలా ఇరువురికి చెందిన సంస్థల నుంచి ఎఫ్‌ఐఐలు వాటాలు ఉపసంహరించుకోవడం చాలా అరుదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కాగా, ముఖేష్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ విదేశీ మదుపర్లను ఆకర్షించలేకపోయినా ఎల్‌ఐసి, సింగపూర్ ప్రభుత్వాన్ని ఆకట్టుకున్నాయి. రూ.1,550 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. దీంతో రిలయన్స్‌లో ఎల్‌ఐసి వాటా 7.09 శాతం నుంచి 7.77 శాతానికి పెరగగా, సింగపూర్ ప్రభుత్వానిది 1.06 నుంచి 1.22 శాతానికి పెరిగింది. మరోవైపు దేశీయ సంస్థాగత మదుపర్లూ రిలయన్స్‌లో తమ వాటాను 10.71 శాతం నుంచి 11.2 శాతానికి పెంచేసుకున్నారు.


Click it and Unblock the Notifications