
జూన్ నెలతో ముగిసే తొలి త్ర్రైమాసికానికి కస్టమ్స్ వసూళ్లు 12.2 శాతం పెరిగి రూ 38.744 కోట్లు, రెవెన్యూ ద్వారా 29.8 శాతం పెరిగి రూ.41,147 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ ద్వారా 40.8 శాతం పెరిగి రూ.28,068 కోట్లు వచ్చాయన్నారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కస్టమ్స్ డ్యూటీ ద్వారా వచ్చే వసూళ్లు తగ్గు ముఖం పట్టాయని చెప్పారు. కాగా దిగుమతులు, సంబంధిత సుంకాలు, మినహాయింపులు వంటి అంశాలపై తగిన సమాచారం అందించడం, వీటిపై మరింత అవగాహన పెంపొందించడం లక్ష్యంగా రెవెన్యూశాఖ కీలక చొరవ తీసుకుంది. వెబ్ ఆధారిత ఇంటరాక్టివ్ కస్టమ్స్ టారిఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించగా... సీబీఈసీ చైర్మన్ గోయెల్ దీనిని ఆవిష్కరించారు.
ఈ సందర్బంలో గోయెల్ మాట్లాడుతూ ఇక కేవలం జూన్ నెల విషయానికి వస్తే పరోక్ష పన్నుల వసూళ్లు 14.8 శాతం పెరిగి రూ.37,748 కోట్లు వసూలైనాయి. వీటిలో కస్టమ్స్ సుంకం ద్వారా రూ.13,284 కోట్లు ఎకై్సజ్ సుంకం ద్వారా రూ.13,849 కోట్లు సర్వీసు టాక్స్ ద్వారా రూ.10,615 కోట్లు వసూలు అయ్యాయి. అయితే ప్రభుత్వం పరోక్ష పన్నుల వసూళ్లు టార్గెట్ ఈ ఆర్థిక సంవత్సరం భారీగా రూ.5.05 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది.
వాటిలో కస్టమ్స ఎక్సైజ్, సర్వీసు టాక్స్‌లు కలుపుకుని 2011-12 ఆర్థిక సంవత్సరంలో పోల్చుకుంటే 27 శాతం ఎక్కువ. 2011-12 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల వసూళ్లు రూ 3.92,781 కోట్లు వసూలు జరిగింది. బడ్జెట్‌లో అంచనా వేసిన దాంట్లో 99.6 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి ప్రత్యక్ష పన్నులు గరిష్ఠంగా వసూళ్లు 6.77 శాతం పెరిగి రూ 1.11 లక్షల కోట్లకు చేరంది. వాస్తవానికి లక్ష్యంగా నిర్ణయించిన దాని కంటే 15 శాతం తక్కువ వసూళ్లయ్యాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications