30 ఏళ్లే లోపు వారే ఆలస్యంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు

ఇది ఇలా ఉంటే ఆల్యంగా పైలింగ్ చేసే వారిలో 36 ఏళ్ల ఆపైబడిన వారు సుమారు 17 శాతంగా తెలిపింది. ఆన్ లైన్ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ పోర్టల్ ట్యాక్స్ స్పానర్ వివరించిన దాని ప్రకారం ఆలస్యంగా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసేవారిలో 96 శాతం మందికి వేతనం తప్ప వేరే ఇతర ఆదాయం లేదని పేర్కోంది. ట్యాక్స్ ఫైలింగ్‌లో ఆలస్యానికి ప్రస్తుత వ్యవస్దలో లోపం కారణం కాదని తెలిపింది.
ఆలస్యంగా ఫైల్ చేసే వారిలో హైదరాబాద్, చెన్నై వాసుల వాటా 9 శాతం కాగా... భారతీయుల్లో 50 % మంది చివరి నెల జూలైలో తమ ట్యాక్స్ రిటర్న్స్‌ను దాఖలు చేస్తున్నారు. వేతన జీవుల్లో 46% మంది జూలై చివరి వారంలో రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. చెన్నైలో మహిళలను ‘బెస్ట్ ట్యాక్స్ ప్లానర్స్'గా నివేదిక పేర్కొంది. మహిళలు యావరేజిగా రూ 4 లక్షల ఇన్ కమ్ సంపాదిస్తున్నారని అనుకుంటే వీరి ట్యాక్స్ రేషియో 2 శాతం.. ఇదే ఇతర నగరాల్లోనే మగవారితో పోలిస్తే ఎక్కువేనని తెలిపింది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీసహా ప్రధాన పట్టణాల్లోని 500 కంపెనీల ఉద్యోగుల సమాచారం ప్రాతిపదికన ట్యాక్స్‌స్పానర్ ఈ వివరాలను వెల్లడించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications