Reliance: రిలయన్స్ డీమెర్జింగ్ కు పూర్తి ఆమోదం.. త్వరలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్
Reliance: దేశంలో అతిపెద్ద కంపెనీగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ డీమెర్జింగ్ వైపు అడుగులు వేస్తుండటం అందరికీ తెలిసిందే. ఇందుకు గాను కంపెనీ వాటాదారులతో పాటు రుణదాతలు సైతం తాజాగా అంగీకారం తెలిపారు. కంపెనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్మ్ రిలయన్స్ స్ట్రాటజిక్ వెంచర్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ-ఓటింగ్ ద్వారా దీనిపై ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు.
సెక్యూరిటీస్ రెగ్యులేటర్ కు కంపెనీ దాఖలు చేసిన పత్రికా ప్రకటనలో డీమెర్జింగ్ గురించి రిలయన్స్ ప్రస్తావించింది. 100 శాతం ఓట్లు విభజనకు అనుకూలంగా వచ్చినట్లు పేర్కొంది. తద్వారా అందరి ఆమోదంతో కొత్తగా, స్వతంత్ర సంస్థగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనసాగనుంది. మాజీ బ్యాంకర్ KV కామత్ ఈ సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటిటీని వేరు చేయడానికి అక్టోబర్ 2022లో ఆమోదం లభించింది. కానీ వాటాదారులు మరియు రుణదాతల నుండి అంగీకారం పొందలేదు. ప్రస్తుత విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు NSE మరియు BSE రెండు ఇండెక్స్‌లలోనూ లిస్ట్ చేయబడతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులు మాతృ సంస్థకు చెందిన ప్రతి షేరుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక షేరును అందుకుంటారు.
రిలయన్స్ స్ట్రాటజిక్ వెంచర్స్ కు చెందిన లిక్విడ్ అసెట్ షేర్‌లను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్వైర్ చేసుకోనుంది. తద్వారా రుణాలు ఇచ్చే వ్యాపారానికి అవసరమైన లిక్విడ్ క్యాపిటల్‌ని తీసుకురావడానికి సమీకరించనుంది. ఇదే కాక బీమా, పేమెంట్స్, ఇ-బ్రోకింగ్ మరియు అసెట్ మేనేజ్‌మెంట్‌తో సహా ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ వర్టికల్స్‌ను రాబోయే మూడేళ్లపాటు నిర్వహించనుంది.


Click it and Unblock the Notifications