కరోనా ప్రభావం అమెరికాపై భారీగా పడింది. ఏ దేశంలో లేనన్ని కేసులు, మరణాలు అగ్రరాజ్యంలో ఉన్నాయి. ఈ రోజు వరకు అమెరికాలో 50వేల మందికి పైగా మృతి చెందగా, దాదాపు 9 లక్షల కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థపై భారీగా పడుతోంది. అమెరికా ఆర్థికవ్యవస్థ కూడా చిన్నాభిన్నమవుతోంది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.

ప్రతి 6గురిలో ఒకరికి ఉపాధి కరువు
అమెరికాలో ఉపాధి సూచీలు చూస్తే కరోనా ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో కనిపిస్తుంది. దాదాపు ప్రతి ఆరుగురు వర్కర్స్‌లో ఒకరు ఉపాధి కోల్పోయారు. గత కొద్ది వారాల్లోనే లక్షలు, కోట్లాది మంది కరోనా నిరుద్యోగ ప్రయోజనాల కింద దరఖాస్తు చేసుకున్నారు. 1930లో వచ్చిన మహామాంద్యం తర్వాత అతిపెద్ద ఉద్యోగాల కోత మళ్లీ ఇప్పుడే చోటు చేసుకుంది. బిజినెస్, హాస్పిటల్స్‌కు సహకరించేందుకు యూఎస్ ప్రతినిధుల సభ 500 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.

15 శాతం నుండి 20 శాతం
నిరుద్యోగ భృతి ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల మరో 4.4 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలో కరోనా కారణంగానే ఉద్యోగాలు కోల్పోయిన వారు 26 మిలియన్ల మంది (2.6 కోట్లు) ఉన్నారు. రోజురోజుకు ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం నిరుద్యోగ రేటు 15 శాతం నుండి 20 శాతం మధ్య ఉందని అంచనా.

పదేళ్లలో వచ్చిన ఉద్యోగాలన్నీ హుష్ కాకి
అమెరికాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 2007-09 మధ్య వచ్చిన ఆర్థిక సంక్షోభం అనంతరం 23 మిలియన్ల ఉద్యోగాలు వచ్చాయి. కరోనా కారణంగా ఈ రెండు నెలల్లోనే ఆ ఉద్యోగాలు అన్నీ ఊడిపోయాయి. ఉద్యోగ నష్టాలు ప్రస్తుతానికి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మున్ముందు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

1.7 మిలియన్ల నుండి..
1930లో నిరుద్యోగ రేటు తర్వాత మళ్లీ ఎక్కువగా చూస్తోంది అమెరికా. రెండు నెలల క్రితం నిరుద్యోగుల సంఖ్య 2 లక్షలు ఉండగా, 1.7 మిలియన్ల మంది ప్రయోజనాలు పొందారు. గత వారం కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్‌లలో పెద్ద ఎత్తున కేసులు, మరణాలు చోటు చేసుకోవడంతో ఉపాధి కూడా అలాగే కోల్పోతున్నారు. ఏప్రిల్ నెల రెండో వారానికి ప్రయోజనాలు పొందుతున్న వారి సంఖ్య ఏకంగా 16 మిలియన్లకు చేరుకుంది. గత రెండు వారాల్లోను అది పెరుగుతూ వచ్చింది.

కోలుకోవడానికి ఏళ్లు పట్టవచ్చు
నిరుద్యోగ ప్రయోజనాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో చాలా రాష్ట్రాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే 24 మిలియన్ల నుండి 26 మిలియన్ల మంది నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, పూర్తి లెక్కలు వచ్చాక ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టువచ్చునని భావిస్తున్నారు. అంతకుముందు నిరుద్యోగిత రేటు 3.5 శాతంతో 50 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. తిరిగి ఆ స్థాయికి రావడానికి ఏళ్లు పట్టవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications