దేశంలోని MSMEలకు శుభవార్త.. రెండు రిలీఫ్ ప్యాకేజీలను ప్రకటించే పనిలో కేంద్ర ప్రభుత్వం..
MSME News: భారత ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలది చాలా పెద్ద పాత్ర. అవి ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. అయితే వీటిని కాపాడైందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద చర్యలను ప్రకటించనుంది.
MSMEల కోసం యూనియన్ బడ్జెట్ 2023-24లో వాణిజ్య వివాదాల కోసం ప్రకటించిన రెండు ప్రధాన "ఉపశమన ప్యాకేజీలను" అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కరోనా కాలంలో ఒప్పందాలను అమలు చేయడంలో MSME విఫలమైతే.. వాటికి సంబంధించి జప్తు చేసిన బిడ్ లేదా పర్ఫామెన్స్ సెక్యూరిటీ సొమ్ములో 95 శాతాన్ని తిరిగి వెనక్కు ఇన్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి సంబంధించి రానున్న కొన్ని వారాల్లో జూన్ కి ముందరే ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ ప్రారంభించబడుతుందని సీనియర్ అధికారి వెల్లడించారు. ఒప్పంద వివాదాలను పరిష్కరించడానికి ఉద్దేశించిన 'వివాద్ సే విశ్వాస్'లో భాగంగా నిబంధనలతో కూడిన స్వచ్ఛంద పరిష్కారానికి స్కీమ్ ఉద్ధేశించబడింది.
తాజా పరిష్కారాల్లో పాల్గొనే వాటాదారులు NHAI వంటి ప్రభుత్వ సంస్థలకు చెందినవారని తెలుస్తోంది. వీరికి తోడు ఇతర ప్రైవేట్ కాంట్రాక్టర్లు కూడా ఉండనున్నారు. వివాదాల స్వభావం కారణంగా.. కాంట్రాక్టర్లకు సంబంధించిన స్కీమ్‌లోని రెండవ భాగాన్ని పరిష్కరించడంలో కొన్ని సంక్లిష్టతలు ఉండవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే 90 శాతం కేసులను పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది. NHAI చేపట్టిన హైవే ప్రాజెక్టులపై వివాదాల్లో ప్రైవేట్ కాంట్రాక్టర్లు లేవనెత్తిన వాదనలు గత ఐదేళ్లలో మధ్యవర్తిత్వంలో రూ.88,100 కోట్లకు చేరువలో ఉన్నాయని అంచనా.


Click it and Unblock the Notifications