భారతదేశ సార్వభౌమ రుణ రేటింగ్‌ను తగ్గించిన మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మరో షాక్ ఇచ్చింది. కరోనా -లాక్ డౌన్ తర్వాత దేశంలో రిటైల్, స్మాల్ బిజినెస్ రుణాలలో క్షీణత నమోదవుతుందని పేర్కొంది. భారత సార్వభౌమ రేటింగ్ తగ్గించడానికి కారణాలు వివరిస్తూ గత మూడు నాలుగేళ్లుగా మందగమనం, సంస్కరణలు అమలు సరిగాలేకపోవడం, కరోనా -లాక్ డౌన్ వంటి వివిధ కారణాలు వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థకు నష్టాలు పెరగనున్నాయని పేర్కొంది.

అంతకుముందే ఒత్తిడిలో వివిధ రంగాలు
కరోనా మహమ్మారికి ముందే మందగమనం కారణంగా కొన్ని రంగాలు ఒత్తిడిలో ఉన్నాయని మూడీస్ తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీలు సమీప భవిష్యత్తులో మరింత ఒత్తిడిలోకి వెళ్తాయని తెలిపింది. ఇవి బ్యాంకు రుణాల్లో 10 శాతం నుండి 15 శాతం వరకు ఉంటాయని వెల్లడించింది. అలాగే, బ్యాంకు రుణాల్లో ప్రయివేటు పవర్ సెక్టార్ రుణాలు 8 శాతం నుండి 10 శాతం ఉంటాయని తెలిపింది. ఇందులో ప్రయివేటు బ్యాంకులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

పాలకుల ముందు పెను సవాల్
ఇప్పుడు రిటైల్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ (SME) రుణాల నాణ్యత క్షీణిస్తుందని మూడిస్ పేర్కొంది. ఇది మొత్తం రుణాలలో 44 శాతం వరకు ఉంటుందని వెల్లడించింది. మందగమనం, కరోనా - లాక్ డౌన్ కారణంగా బలహీన వృద్ధి రేటు, బలహీనమైన ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక రంగంపై పెరుగుతున్న ఒత్తిడి వంటి వివిధ సవాళ్లు పాలకుల ముందు ఉన్నాయని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలకు నష్టాలు పెరుగుతున్నాయని తెలిపింది.

రుణభారం అధికం
మిగతా ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత రుణభారం ఎక్కువగా ఉందని మూడిస్ తెలిపింది. కరోనాకు ముందే దేశంలో మందగమనం ఉందని గుర్తు చేసింది. బలహీనమైన ఆర్థిక వ్యవస్థకు తోడు వివిధ అంశాలు ఆందోళనకర అంశాలని అభిప్రాయపడింది. రోజురోజుకు పాలకులకు సవాళ్లు పెరుగుతున్నాయని, అదే సమయంలో సంస్కరణలు అంత వేగంగా లేకపోవడం ఆటంకం కలిగిస్తోందని పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications