కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో దాదాపు 2.5 కోట్ల నుండి 5 కోట్ల వరకు ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇండియాలో లాక్ డౌన్ కారణంగా నిరుద్యోగ రేటు పెరుగుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో నిరుద్యోగిత రేటు 20 శాతం దాటింది.

టెలిఫోన్ ద్వారా సర్వే
ఏప్రిల్ 5వ తేదీ వరకు 9,429 పరిశీలనల నమూనా ఆధారంగా నిరుద్యోగిత రేటు 23.4 శాతంగా ఉంటుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు CMIE చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ వ్యాస్ వెల్లడించారు. మార్చి చివరి వారంలో వారు తమ సర్వేను నిలిపివేశారు. అయితే ఏప్రిల్ 5వ తేదీ వరకు టెలిఫోన్ ద్వారా సర్వే నిర్వహించారు.

తగ్గుతున్న ఉద్యోగాలు, పెరుగుతున్న నిరుద్యోగం
మార్చి నెలలో నిరుద్యోగిత రేటు 8.7 శాతంగా ఉంటుందని CMIE అంచనా వేసింది. ఇది ఫిబ్రవరిలో 7.8 శాతంగా నమోదయింది. మార్చి కార్మిక గణాంకాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని చెప్పారు వ్యాస్. ఉపాధి లేదా ఉద్యోగంలో క్రమంగా తరుగుదల కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో మార్చి 2020లో నిరుద్యోగం విషయంలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని తెలిపారు. శాంపిల్ సైజ్ కూడా గతంలో కంటే ఎక్కువ తీసుకున్నట్లు తెలిపారు.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో..
ప్రభుత్వం ప్రతి ఏడాది నిరుద్యోగ డేటాను పబ్లిష్ చేస్తుంది. 2019లో చివరి డేటా విడుదలైంది. దీని ప్రకారం నిరుద్యోగిత రేటు 6.1 శాతంతో 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో నిరుద్యోగిత రేటు ఏకంగా 23 శాతం పెరిగిందని ఈ సర్వే వెల్లడించింది. అయితే లాక్ డౌన్ తర్వాత ఇంత ఉండే అవకాశం లేదు. మార్చి 29 నాటికి నిరుద్యోగిత రేటు 23.8 శాతం పెరిగితే, ఉద్యోగాల శాతం 38.2 శాతం పడిపోయింది.

50 మిలియన్ల ఉద్యోగాల కోత
మరో షాకింగ్ విషయం ఏమంటే లాక్ డౌన్ ఎత్తివేసిన 2 వారాల్లో దాదాపు 50 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఈ రంగానికి చెందిన ప్రోణబ్ సేన్ అనే నిపుణులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కొంతమందిని ఇంటికి పంపించి ఉండవచ్చునని, కానీ నిరుద్యోగిత రేటు ఎక్కువే ఉండవచ్చునని, దీని ప్రభావం తర్వాత తెలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అర్బన్ ఏరియాల్లో..
నిరుద్యోగిత రేటు అర్బన్ ఏరియాల్లో ఇలా ఉంది... 15 మార్చి 2020 నాటికి 8.21 శాతం, 22 మార్చి 2020 నాటికి 8.66 శాతంగా ఉంది. 29 మార్చి 2020 నాటికి ఇది 30.01 శాతం, 5 ఏప్రిల్ 2020 నాటికి 30.23 శాతానికి చేరుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications