For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: పెరిగిన బంగారం ధరలు, రూ.51,000 క్రాస్

|

బంగారం ధరలు నేడు (మే 30, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు రూ.51,000 క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1860 డాలర్లు దాటింది. గోల్డ్ ఫ్యూచర్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5000కు పైగా తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 215 డాలర్ల వరకు తక్కువగా ఉంది.

ఎంసీఎక్స్‌లో నేడు ఉదయం జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.137 పెరిగి రూ.51,050 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.120 పెరిగి రూ.51,170 వద్ద కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్ ధరలు కూడా పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.391 పెరిగి రూ.62,507 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.410 పెరిగి రూ.63,248 వద్ద ట్రేడ్ అయింది.

Gold prices rise in range bound trade as dollar dips

కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వార్త రాసే సమయానికి 8.80 డాలర్లు లాభపడి 1860 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.181 డాలర్లు ఎగిసి 22.277 డాలర్ల వద్ద కదలాడింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 215 డాలర్లు తక్కువగా ఉంది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1851 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 3 శాతం క్షీణించింది. డాలర్ వ్యాల్యూ క్రమంగా తగ్గుతుండటంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి.

English summary

Gold prices today: పెరిగిన బంగారం ధరలు, రూ.51,000 క్రాస్ | Gold prices rise in range bound trade as dollar dips

Gold prices firmed in choppy trading on Monday, as a weakening dollar buoyed greenback-priced bullion, although gains were capped by some investors turning to riskier assets in Asia.
Story first published: Monday, May 30, 2022, 11:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X