ఎంఎస్ఎంఈలకు రూ.1 లక్ష కోట్లు, కేంద్రం నుండి భారీ ఊరట
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(MSME)లకు నిధుల ఇబ్బందులు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1 క్ష కోట్ల పథకాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎంఎస్ఎంఈలకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఆమోదం అనంతరం కేబినెట్ పరిశీలనకు పంపిస్తామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దేశంలోని MSME చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేందుకు ఈ నిధిని కేంద్రం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ నిధి ఏర్పాటు కోసం తాము ఓ స్కీమ్‌ను రూపొందించామన్నారు. చెల్లింపులు చేస్తున్న కంపెనీకి, అందుకుంటున్న కంపెనీకి, బ్యాంకులకు మధ్య వడ్డీ భారం ఏ విధంగాపంచుకోవాలనే అంశంపై కూడా తాము ఒక ఫార్ములా రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ఈ నిధి ఏర్పాటు ఎంఎస్ఎంఈలకు కొంత ఊరటనిస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, భారీ పరిశ్రమలు MSMEలకు పెద్ద ఎత్తున బకాయి పడ్డాయని చెప్పారు. దీంతో ఈ నిధితో ఆ బకాయిల్ని చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ వాటాధనంతో దీనిని బలపరుస్తామన్నారు. మార్కెట్లో నగదు లభ్యత పెరిగేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
అయినప్పటికీ MSMEలకు బాకీపడిన మొత్తాలను వెంటనే చెల్లించాలని, అన్ని ప్రభుత్వ శాఖలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీ కోరారు. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోతోన్న విషయం తెలిసిందే. MSMEల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కేంద్రం చర్యలకు దిగింది.


Click it and Unblock the Notifications