కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ECLGS) కింద 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 22 ప్రయివేటు రంగ బ్యాంకులు 23 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజురూ చేస్తున్నాయి. శుక్రవారం నాటి ఫైనాన్స్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం జూన్ 23వ తేదీ నాటికి ఎంఎస్ఎంఈలకు ఇప్పటి వరకు రూ.1,30,491 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.82,065 కోట్లు పంపిణీ చేశారు.

ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల రుణ మంజూరు
రూ.21 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు ECLGS కింద రూ.3 లక్షల కోట్ల రుణాలను కేటాయించిన విషయం తెలిసిందే. దీని కింద బ్యాంకులు ఇప్పటి వరకు రూ.1,30,491.79 కోట్లు మంజూరు చేసినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ECLGS కింద పబ్లిక్ సెక్యార్ బ్యాంకుల రుణాలు రూ.71,818.16 కోట్లకు పెరిగాయని, జూలై 23 నాటికి ఇందులో రూ.47,631.41 కోట్లు పంపిణీ జరిగినట్లు తెలిపింది. ప్రయివేటు బ్యాంకులు రూ.58,673 కోట్లు మంజూరు చేయగా, రూ.34,433 పంపిణీ చేసినట్లు తెలిపింది.

ఎస్బీఐ అధిక రుణాలు
జూలై 20, 2020 నాటితో పోల్చితే రుణ మంజురూ రూ.2,909.19 కోట్లు పెరిగిందని, ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో కలిపి రూ.4,451.95 పెరుగుదల నమోదు అయినట్లు తెలిపింది. ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ ఎక్కువగా రూ.21,027 కోట్లు మంజూరు చేయగా, రూ.15,112 కోట్లు పంపిణీ చేసింది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.9,463 కోట్లు మంజూరు చేసి, రూ.5,295 కోట్లు పంపిణీ చేసింది.

కార్పస్ ఫండ్
ECLGS కింద ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు మే 20వ తేదీన కేబినెట్ ఆమోదం తెలిపింది. కన్సెషనల్ రేటు 9.25 శాతానికి ఈ రుణాలు ఇస్తున్నారు. ECLGS స్కీం కింద అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలకు, ఆసక్తి కలిగిన మైక్రో యూనిట్ల అభివృద్ధికి 100 శాతం గ్యారంటీతో ఈ రుణాలు ఇస్తున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.41,600 కోట్లతో కార్పస్ ఏర్పాటు చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications