స్టాక్ మార్కెట్ క్లోజింగ్ బెల్..భారీ నష్టాల నుంచి తృటిలో తప్పించుకున్న షేర్ మార్కెట్.. ఎలా బయటపడిందంటే..
Stock Market Closing Bell: అమెరికా సుంకాల భయాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, మధ్యాహ్నం వేళ ఎదురైన ఒడిదుడుకులన్నింటినీ అధిగమిస్తూ, గురువారం (నవంబర్ 26, 2026) భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్‌లు లాభాలతో ముగిశాయి. క్లోజింగ్ వేళ సెన్సెక్స్ 337 పాయింట్లు (0.40 శాతం) పెరిగి 84,275 స్థాయి వద్ద ముగియగా.. నిఫ్టీ 50 సూచీ 78 పాయింట్లు (0.30 శాతం) పుంజుకుని 25,897వద్ద స్థిరపడింది.
ఉదయం 25,873.20 వద్ద ప్రారంభమైన నిఫ్టీ తొలుత 9:45 గంటల ప్రాంతంలో 25,733.50 కనిష్ఠ స్థాయికి జారిపోయినప్పటికీ.. ఆ వెంటనే కోలుకుని 11 గంటలకల్లా 25,970 మార్కును దాటింది. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత లాభాల స్వీకరణతో పాటు సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రిఫైనరీపై హౌతీ దాడుల వార్తల నేపథ్యంలో బ్రెంట్ ముడిచమురు ధర 94-95 డాలర్ల స్థాయికి ఎగబాకడం, అమెరికా టారిఫ్ ఉద్రిక్తతలు కలవరపెట్టడంతో 1:30 గంటల సమయంలో నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పతనమైంది.

తిరిగి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఐటీ, హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. మరోవైపు రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడి 92.55 స్థాయికి చేరినా.. మార్కెట్ అస్థిరత సూచిక ఇండియా VIX మాత్రం 4.81 శాతం తగ్గి 16.82 వద్దకు దిగిరావడం మదుపర్లకు ఊరటనిచ్చింది.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచీ 3.34 శాతం లాభంతో అగ్రగామిగా నిలవగా, రియల్టీ (2.53 శాతం), మెటల్స్ (1.26 శాతం) బలమైన రాణింపును కనబరిచాయి. ఫార్మా (0.61 శాతం), ఎనర్జీ (0.50 శాతం) సూచీలు కూడా మధ్యాహ్నం ప్రారంభ నష్టాల నుండి కోలుకుని లాభాల్లోకి వచ్చాయి. దీనికి విరుద్ధంగా వినియోగ వస్తువులు (కన్స్యూమర్ డ్యూరబుల్స్) 1.37 శాతం క్షీణించి అత్యంత బలహీనంగా నిలవగా, ఎఫ్‌ఎంసీజీ (0.67 శాతం), పీఎస్‌యూ బ్యాంక్ (0.59 శాతం), ఆటో (0.49 శాతం) నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ 0.18 శాతం తగ్గి 63,587.40 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 0.80 శాతం, మిడ్‌క్యాప్ 100 0.39 శాతం లాభపడగా.. మొత్తం మార్కెట్ బ్రెడ్త్ సానుకూలంగా ఉండి 2,140 షేర్లు లాభపడగా 1,903 షేర్లు నష్టపోయాయి.
నిఫ్టీలో హెచ్‌సిఎల్‌టెక్ 5.99 శాతం పెరిగి రూ. 1,462.60 వద్ద అగ్రగ్రామిగా నిలవగా.. బీఎస్ఈ లిమిటెడ్ 5.86 శాతం ఎగబాకి రూ. 3,996.50 వద్ద, టీసీఎస్ 4.24 శాతం పెరిగి రూ. 2,624 వద్ద, ఇన్ఫోసిస్ 2.69 శాతం లాభంతో రూ. 1,160.40 వద్ద, టెక్ మహీంద్రా 1.23 శాతం పెరిగి రూ. 1,823.30 వద్ద ముగిశాయి.
మెటల్ షేర్లలో హిండాల్కో 3.10 శాతం పెరిగి రూ. 917.50కి, టాటా స్టీల్ 2.50 శాతం పెరిగి రూ. 163.28కి చేరగా.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.04 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.87 శాతం (రూ. 862), రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.61 శాతం (రూ. 1,396) లాభపడ్డాయి.
మరోవైపు ఏషియన్ పెయింట్స్ 2.79 శాతం తగ్గి రూ. 2,548 వద్ద నిఫ్టీలో అత్యధిక నష్టాలను చవిచూడగా.. శ్రీరామ్ ఫైనాన్స్ 2.66 శాతం (రూ. 963.60), బజాజ్ ఫైనాన్స్ 2.58 శాతం (రూ. 1,102.20), బజాజ్ ఫిన్‌సర్వ్ 2.24 శాతం (రూ. 1,881.90), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 2.09 శాతం (రూ. 1,161), నెస్లే ఇండియా 2.02 శాతం (రూ. 1,331), ఎటర్నల్ 1.79 శాతం (రూ. 365.05), ఐసీఐసీఐ బ్యాంక్ 1.60 శాతం (రూ. 1,613.70), ఐషర్ మోటార్స్ 1.38 శాతం (రూ. 8,221), ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) 1.27 శాతం (రూ. 5,647.40) నష్టపోయాయి.
ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) అన్‌లిస్టెడ్ షేర్లు సరికొత్త రికార్డు గరిష్ఠానికి చేరి మార్కెట్ విలువ రూ. 5.88 లక్షల కోట్లకు చేరడం.. బిపి (BP) సంస్థతో ఫైనాన్స్ ఆపరేషన్స్ ఒప్పందం నేపథ్యంలో విప్రో రాణించడం, తక్కువ ఉత్పత్తి అంచనాలతో చక్కెర షేర్లు 14 శాతం వరకు దూసుకెళ్లడం వంటి పరిణామాలు గురువారం సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


Click it and Unblock the Notifications
